కరోనా అంటే జనాలు ఇంకా వణికిపోతున్నారా… కేసుల పెరుగుదల ఏం సూచిస్తోంది..

-

మానవ పరిణామ క్రమంలో ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి. మన పూర్వీకులు ఎన్నో రకాల ఉపద్రవాలని ఎదుర్కొన్నారు. వాటికి ఎదురొడ్డారు. ఆ ఉపద్రవం ఎన్ని అవస్థలు పెట్టినా చివరికి పైచేయి మాత్రం మనిషిదే అయింది. ప్రస్తుతం మనల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్న కరోనా వైరస్ కూడా అందులో ఒకటి. ఎప్పటికైనా ఈ వైరస్ పై మనిషి పై చేయి సాధిస్తాడు. ఐతే ఈ వైరస్ వచ్చినప్పటి నుండి జనాల్లో ఒకరకమైన వణుకు మొదలయింది.

coronavirus
coronavirus

అదే వణుకు ఇప్పటికీ ఉందా అంటే అనుమానమే. వైరస్ వచ్చి ఐదునెలలు దాటిపోయింది. మొదట్లో ఇంటి నుండి కాలు కూడా బయటకి పెట్టలేదు. కానీ ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. కరోనా భయం ఉన్న మాట నిజమే కానీ మొదట్లో ఉన్నంత లేదనే చెప్పాలి. అందువల్లే రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో పెరిగే కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏంటి..?

మొదటగా ఇండియాలో కరోనా భయం కన్నా ఆర్థిక భయమే ఎక్కువగా ఉంది. ఎక్కువ రోజులు ఇంట్లోనే గడపడం వల్ల ఆర్థికంగా చితికిపోయారు. ఇంకా అలానే ఉంటే తినడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రావచ్చు. సో.. జనాలు బయటకి వస్తున్నారు. కరోనా ఉధృతి పెరుగుతుందని తెలిసినా కూడా రిస్క్ చేసి మరీ తమ కుటుంబాలకి అండగా నిలబడడం కోసం బయటకి వస్తున్నారు.

అదీగాక ప్రస్తుత పరిస్థితులు ఇంకెన్ని రోజులు ఉంటాయో తెలియదు. మూడు నెలల దాకా ఇంట్లోనే ఉండి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, సాలరీ కట్స్.. ఇబ్బంది కలిగించాయి. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే అన్ లాక్ తప్పనిసరి. అందుకే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ ని ఎదుర్కోవడానికి సిద్ధమై తాము రిస్క్ లో పడుతున్నారు. వీటన్నింటి ఫలితమే ఇండియాలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఐతే ఏది ఏమైనా కరోనాకి అంతగా భయపడకపోయినా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడటం, పరిసరాలని నీట్ గా ఉంచుకోవడం ఎందుకైనా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news