కోవిడ్ 19: పల్స్ ఆక్సిమీటర్ వాడుతున్నారా? ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడంతో ప్రతీ ఒక్కరిలో భయాందోళనలు కలుగుతున్నాయి. కరోనా మొదటి వేవ్ కంటే రెండవ వేవ్ ప్రమాదకరంగా ఉండడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలో కరోనా నుండి తమని తాము కాపాడుకోవడానికి ఎవరికి వారే ఇళ్ళలో నుండి బయటకు రాకుండా ఉంటున్నారు. ఐతే కరోనా సోకిందా లేదా లేక, సోకిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాలను తెలుసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్లని ఉపయోగిస్తున్నారు.

ఈ సెకండ్ వేవ్ టైమ్ లో ఈ ఆక్సిమీటర్లకి గిరాకీ బాగా పెరిగింది. చాలామంది ఆక్సిమీటర్లని ఉపయోగిస్తూ ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేసుకుంటున్నారు. కానీ దాన్ని సరిగ్గా వాడడం తెలియకపోతే మీరు సరిగ్గా గుర్తించలేరు. ఆక్సిమీటర్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకునేందుకు ఈ కింది విషయాలు తెలుసుకోండి.

మీ గోళ్ళకి నెయిల్ పాలిష్ ఉంటే తీసేయండి. అలాగే నకిలీ గోళ్ళు ధరించితే వాటిని వెంటనే తొలగించండి.

ఆక్సిమీటర్ వాడేముందు ఒక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

ఆక్సిమీటర్ లో వేలు ఉంచే ముందు ఒక చెయ్యి గుండెమీద పెట్టండి.

ఆ తర్వాత ఆక్సిమీటర్లో చూపుడు వేలు లేదా మధ్యవేలు ఉంచండి.

అందులో చూపించే రీడింగ్ స్థిరంగా ఉండేవరకు వేలిని అలాగే ఉంచండి.

ఒక్కసారి రీడింగ్ స్థిరపడ్డ తర్వాత అత్యధిక వాల్యూని నోట్ చేసుకోండి.

సరిగ్గా రికార్డు చేయండి.

ఒకరోజులో మూడుసార్లు రికార్డు చేయండి. అప్పుడే మీ రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా మారుతున్నాయా అనేది స్పష్టంగా తెలుస్తుంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆక్సిజన్ లెవెల్స్ 93శాతానికి పడిపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.