‘క‌రోనా’ మ‌నిషి.. ర‌హ‌దారుల‌పై సంచారం.. వాహ‌న‌దారుల్లో వ‌ణుకు..!

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్ర‌జలంద‌రూ ఇళ్ల‌లోనే ఉండాల‌ని పోలీసులు ఎంత చెబుతున్నా.. కొంద‌రు మాత్రం విన‌డం లేదు.. ఆ.. మాకేమ‌వుతుంది లే.. అని య‌థా ప్ర‌కారం రోడ్ల మీద‌కు వ‌స్తున్నారు. ఇక ఇలాంటి వారిని లాఠీల‌తో కొట్టీ కొట్టీ పోలీసుల‌కు చేతులు నొప్పి పుడుతున్నాయి.. తప్ప‌.. ప్రయోజ‌నం ఉండ‌డం లేదు. అయితే ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఇలాంటి ధోర‌ణిని మార్చాల‌ని చెప్పి.. చెన్నైకి చెందిన ఓ ఆర్టిస్టు వినూత్న ప్ర‌యోగం చేశాడు. అదేమిటంటే…

chennai police officer wore corona helmet to warn people about corona virus

చెన్నైకి చెందిన గౌత‌మ్ అనే ఓ ఆర్టిస్టు క‌రోనా వైర‌స్‌ను పోలిన ఓ హెల్మెట్‌ను రూపొందించాడు. దాన్ని స్థానికంగా ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ బాబు ధ‌రించారు. అనంత‌రం ఆయ‌న రోడ్ల‌పైకి అలాగే వ‌చ్చి క‌రోనాను అడ్డుకోక‌పోతే ఎలాంటి ప‌రిణామాలు వ‌స్తాయో వాహ‌న‌దారుల‌కు వివ‌రించ‌డం మొద‌లు పెట్టారు. దీని వ‌ల్ల కొంద‌రు వాహ‌నదారుల్లో మార్పు వ‌చ్చింద‌ని పోలీసులు చెబుతున్నారు.

క‌రోనా వైర‌స్‌ను పోలిన ఆ హెల్మెట్‌ను చూసైనా ప్ర‌జ‌ల్లో మార్పు వ‌స్తుంద‌ని ఆర్టిస్టు గౌత‌మ్ భావించాడు. అందుక‌నే క‌రోనా అంత భ‌యంక‌రంగా ఉండేలా ఆ హెల్మెట్‌ను డిజైన్ చేశాడు. చిన్న పిల్ల‌లే కాదు, పెద్ద‌లు కూడా ఆ హెల్మెట్‌ను చూస్తే ఒకింత భ‌య‌ప‌డ‌డం ఖాయం. ఆ భ‌యంతోనైనా ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉంటారు. అందుక‌నే ఆ హెల్మెట్‌ను త‌యారు చేశాన‌ని, అనంత‌రం పోలీసుల‌తో మాట్లాడి ఆ విధంగా కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌ని ఆర్టిస్టు గౌత‌మ్ తెలిపాడు. అవును మ‌రి.. జ‌నాలు భ‌య‌ప‌డాలంటే.. ఆ మాత్రం చేయాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news