చిన్నారులకు కరోనా వ్యాక్సిన్…. కోవాగ్జిన్ టీకాకు కేంద్రం అనుమతి.

దేశంలో ప్రస్తుతం భారీ ఎత్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం జరగుతోంది. దేశంలో ఇప్పటికే 90 కోట్లకు పైగా డోసులను ప్రజలకు అందించారు. 18 ఏళ్ల నుంచి పైబడిన వారందరికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. తాజాగా 2-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. తాజాాగా పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు కోవాగ్జిన్ కు కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో 2-18 ఏళ్లవారికి కోవాగ్జిన్ టీకాను తయారు చేసేందుకు భారత్ బయోటెక్ కు అనుమతి లభించింది.

 కోవాగ్జిన్ తోపాటు జైకోవ్ డి వ్యాక్సిన్ కూడా 12 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చేలా తయారు చేశారు. ప్రపంచంలో మొదటి డీఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ గా జైకోవ్ డీ వ్యాక్సిన్ను జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ తయారు చేస్తోంది. ప్రస్తుతం జైకోవ్ డీ ధర విషయంలో కేంద్రం సదరు సంస్థతో చర్చలు జరుపుతుంది. ఇది కూడా అందుబాటులోకి వస్తే పిల్లలకు రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.