హుజురాబాద్ లో కారు బీభత్సం : బాల్క సుమన్ పై సంచలన ఆరోపణలు !

హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం ఇప్పల్లి క్రాస్ రోడ్డు లో జరిగిన ప్రమాదం పై బిజెపి నాయకులు ఫైర్ అయ్యారు. ఆటోను కారు ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ నాగుర్ల రాజేందర్ అక్కడిక్కడే మృతి చెందాడు. బాల్క సుమన్ వర్గీయుల చెందిన కారు అని బీజేపీ నాయకులు నిరాసన కు దిగారు. ఈ ఘటన కు కారణమైన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు బిజెపి నేత ఈటెల రాజేందర్.

ఇక ఈ ప్రమాదంపై స్పందించిన సిపి తరుణ్ జోషి.. ఈ ఘటన పై కేసు నమోదు అయిందని.. కారు, డ్రైవర్ తమ అదుపులో ఉన్నట్టు తెలిపారు. తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాల్క సుమన్ కూడా స్పందించారు.

నిన్న హుజురాబాద్ నియోజకవర్గం కమలపూర్ మండలం భింపల్లి క్రాస్ వద్ద ఆటో, కారు ప్రమాదంలో తమ పార్టీకి తన కు సంభందం లేదని.. ఆ ఆక్సిడెంట్ చేసిన కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మిత్రుడుదన్నారు. చనిపోయిన రాజేందర్ కుటుంబానికి బీజేపీ పార్టీ కోటిన్నర ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర డీజీపీ, పోలీస్ కమిషనర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నామని చెప్పారు. ఆ కారు తనది అన్నారు.. ఆ తర్వాత మాట మార్చి మా తమ్ముడిది అన్నారని ఫైర్ అయ్యారు.