భారత్ లో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజే 14వేలకు పైగా కేసులు

-

ప్రపంచ వ్యాప్తంగా తన పంజా విసురుతోన్న కరోనా మహమ్మారి భారత్ లో మాత్రం ఓసారి పెరుగుతూ మరోసారి తగ్గుతూ వస్తోంది. భారత్ లో ముఖ్యంగా విద్యార్థులపై కరోనా విలయం సృష్టిస్తోంది. దేశంలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం 8 గంటల వరకు 14,092 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. పాజిటివిటీ రేటు 4.36 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.54 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.26 శాతానికి పడిపోయాయి.

  • క్రియాశీల కేసులు: 1,16,861
  • మొత్తం మరణాలు: 5,27,037
  • కోలుకున్నవారు:4,36,09,566

భారత్​లో శనివారం 28,01,457 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,07,99,63,555కు చేరింది. మరో 3,81,861మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచ దేశాల్లోనూ కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 5,78,704మంది వైరస్​ బారినపడగా.. మరో 1,318 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 59,45,50,623కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,53,327 మంది మరణించారు. ఒక్కరోజే 7,60,524 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,75,23,279కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news