జూన్ లో కరోనా తీవ్ర రూపం…తెలంగాణ వైద్యారోగ్య శాఖ అంచనా

-

దేశంలో మళ్లీ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో కేసుల్లో పెరుగుదల చూస్తున్నాం. ఇవన్నీ గమనిస్తే ఫోర్త్ వేవ్ తప్పదా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా కరోనా కేసులపై అప్రమత్తం అవుతోంది. 

తెలంగాణలో జూన్ రెండో వారం నాటిక కరోనా తీవ్రరూపం దాలుస్తుందని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రోజుకు 40 వరకు కేసులు నమోదు అవుతుండగా… వీటి సంఖ్య జూన్ లో 2500-3000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచానా వేసింది. దీంతో ఫోర్త్ వేవ్ త్వరలోనే ముంచు రానున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంచానా వేసింది. దేశ వ్యాప్తంగా నిన్నమొన్నటి వరకు 2 వేల లోపు ఉన్న కరోనా కేసుల సంఖ్య 3 వేలను దాటింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news