ఇండియాలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు… కొత్తగా 3275 కరోనా కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం 2 వేలకు దిగువన ఉన్న కేసులు ప్రస్తుతం 3 వేలను దాటి నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలోని మొత్తం కేసులను చూసుకుంటే ఢిల్లీలోనే సగానికి పైగా కేసులు నమోదు అవ్వడం కలవరానికి గురిచేస్తోంది. అయితే గతంతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా వరకు తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం

తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో 3275 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారి నుంచి 3010 మంది కోలుకోగా, 55 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 19,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియాలో మొత్తం 5,23,975 మంది మరణించారు. కరోనా నుంచి 4,25,47,699 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 13,99,710 డోసుల వ్యాక్సిన్లు అందించారు. దేశంలో అర్హులైన వారందరికీ వేగంగా వ్యాక్సినేషన్ అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 189 కోట్ల డోసులు వ్యాక్సిన్ ను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news