బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి చాల మంది నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరికొంత మంది సంపూర్ణ ఆరోగ్యతో కోలుకొని ఇంటికి చేరారు. ఇక తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పరీక్ష అనంతరం రిపోర్టులో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.

jp-nadda
jp-nadda

ఆయన కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఇటీవల నన్ను కలిసి వారంతా హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండండి. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి. అని హిందీలో ట్వీట్ చేశారు నడ్డా.

ఇక జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు బీజేపీ నేతలు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు. కాగా, మనదేశంలో కరోనా తగ్గముఖం పట్టిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 30,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 33,136 కోలుకోగా..391 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,57,029కి చేరింది. ఇప్పటి వరకు 93,57,464 మంది కోలుకోగా.. కరోనా కాటుకు 1,43,019 మంది బలయ్యారు. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. నిన్న మన దేశంలో 10,14,434 మందికి కరోనా పరీక్షలు చేశారు. దాంతో ఇప్పటి వరకు చేసిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 15 కోట్ల 37 లక్షల 11,833కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news