గవర్నర్ ని వదలని కరోనా.. పంజా విసిరి చివరికి..!

ప్రస్తుతం సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ అందరిపై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అయితే కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రజాప్రతినిధులు ఎక్కువై పోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజాప్రతినిధులపై పంజా విసురుతుంది కరోనా వైరస్.

 

ఇటీవల కేరళ గవర్నర్ మహమ్మద్ ఖాన్ పై కరోనా వైరస్ పంజా విసిరింది. కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలినట్లు ప్రస్తుతం రాజ్భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత కొన్ని రోజుల క్రితం తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా నిర్ధారిత పరీక్షలు చేసుకోవాలని.. అందరు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలి అంటూ కేరళ గవర్నర్ మహమ్మద్ ఖాన్ సూచించారు.