Vaccination: నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్

-

నేటి నుంచి 18 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసులు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయింది. ప్రైవేటు టీకా కేంద్రాాల్లో ఈ టీకా ఇవ్వనున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి.. రెండవ డోస్ తీసుకుని 9 నెలలు పూర్తి అయిన వారు ప్రైవేట్ టీకా కేంద్రాల్లో బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. గతంలో కోవిన్ యాప్ లో నమోదు చేసుకున్న విధంగానే…. బూస్టర్ డోస్ కోసం కూడా నమోదు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషనరీ డోస్ ఇస్తున్నారు.

ఇప్పటికే దశల వారీగా వ్యాక్సినేషన్ ఇస్తూ వస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 2020 జనవరి 16న ప్రారంభించింది. జనవరి 16 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. 2020 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. 2020 ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2020 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. 2022 జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మార్చి 16 నుంచి  12-14 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. తాజాగా ఏప్రిల్ 10 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news