కరోనా గుట్టు చెప్పే మెషిన్.. ఎలా అంటే?

-

ప్రస్తుత కాలంలో కొద్దిగా దగ్గు, జలుబు ఉన్నట్లయితే, వెంటనే భయంతో కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే. అయితే పరీక్ష చేయించుకున్న రెండు మూడు రోజుల తర్వాత గాని పరీక్షా ఫలితాలు రావు. కానీ ఇప్పుడు ఇంకోలా తెలుసుకునే అవకాశం ఉంది. ఎవరైనా దగ్గినపుడు వచ్చే శబ్దాన్ని బట్టి, వారు కరోనాతో బాధపడుతున్నారా లేదా సాధారణ దగ్గుతో బాధపడుతున్నారా అన్న విషయాన్ని వెంటనే తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముంబైకి చెందిన వధ్వానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్ సరికొత్త సాంకేతికతను ఉపయోగించి, ఎటువంటి శబ్దాలు కరోనాకు సంబంధం ఉందో చెప్పే ఒక పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరానికి ఇప్పటికే అమెరికా నుంచి పేటెంట్ లభించింది. ఒక కరోనా బాధితులనే కాకుండా ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండే కరోనా బాధితులను కనుగొనడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని ఉపయోగించి దేశంలో 43 శాతం ఎక్కువ పరీక్షలు నిర్వహించవచ్చని ప్రధాన పరిశోధకుడు రాహుల్ ఫణిక్కర్ చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 67. 7% మంది వైరస్ ఉన్నవారికి పొడి దగ్గు మాత్రమే ఉంటుంది. వారిలో ఎలాంటి శ్లేష్మం ఉత్పత్తి కాదు. జలుబు లేదా అలర్జీ కి సంబంధమైన తడి దగ్గు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండి, అధిక మొత్తంలో శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. దీని ఆధారంగా వారి దగ్గర నుంచి వచ్చే శబ్దాన్ని బట్టి కనుగొనవచ్చు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ల భాగస్వామ్యంతో వద్వానీ ఇన్స్టిట్యూట్ ఈ పరిశోధన కొనసాగించింది. ఈ పరిశోధనలో భాగంగా 3,621 మంది నుంచి శబ్ద నమూనాలను సేకరించారు, అయితే వారిలో 2, 041 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news