ఆల్ప్స్‌ పర్వతంపై మూడురంగుల వెలుగులు

-

ప్రపంచం కరోనా గుప్పిట్లో విలవిలలాడుతున్న ఈ సందర్భంలో ఒకరికొకరు సంఘీభావం తెలుపుకోవడమే మానవత్వం. అదే ఈ సందేశం.

భూలోక స్వర్గంగా భాసిల్లే స్విట్జర్లాండ్‌, భారతదేశానికొక సంఘీభావ సందేశం పంపింది. అన్ని దేశాలతో పాటుగా కరోనా బారిన పడి బాధపడుతున్న భారత్‌కు స్వాంతన పలికేందుకు స్విట్జర్లాండ్‌, తన ప్రఖ్యాత ఆల్ప్స్‌ పర్వతాలను వేదికగా చేసుకుంది. కారుచీకట్లలో కాంతిరేఖగా మేమున్నామంటూ సంఘీభావం తెలిపింది,

స్విట్జర్లాండ్‌లోని ఎత్తయిన పర్వత శిఖరాలలో ఒకటైన మాటర్‌హార్న్‌ పర్వత శిఖరంపై భారత పతాకాన్ని ప్రసరింపజేసి, కరోనాపై పోరులో తాము మీవెంటే ఉంటామనే సంఘీభావ సందేశాన్ని పంపింది.

భారత ప్రధాని నరేంద్రమోదీ, 14692 అడుగుల ఎత్తయిన ఈ పర్వతం, భారత పతాక త్రివర్ణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న చిత్రాన్ని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసారు.’’ ప్రపంచమంతా ఒక్కటై కరోనాపై పోరు సాగిస్తోంది. ఈ ఉత్పాతం నుండి మానవత్వం తప్పకుండా కోలుకుంటుంది ’’ అనే సందేశాన్ని దీనికి జత చేసారు.

‘‘ కోవిడ్‌-19పై పోరులో భారత్‌కు స్విట్జర్లాండ్‌ స్నేహపూర్వక సంఘీభావం తెలుపుతోంది. మాటర్‌హార్న్‌ త్రివర్ణాలతో వెలిగింది.  హిమాలయాల నుండి ఆల్ప్స్‌ వరకు ఓ అద్భుతమైన స్నేహం…’’ అంటూ జెనీవాలోని భారత విదేశాంగ శాఖ అధికారిణి గుర్లిన్‌ కౌర్‌ తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో తెలిపింది. స్విస్‌ పర్యాటక పట్టణం జెర్మాట్‌ టూరిజం శాఖ, ఈ సందేశాన్ని భారతీయులందరికీ తాము తోడున్నామని తెలియజేయడానికి పంపుతున్నామంటూ తెలిపింది.

గత వారం రోజుల నుండి, ప్రతీ సాయంత్రం స్వాంతననిచ్చే చిత్రాలు, మాటలను మాటర్‌హార్న్‌ పర్వత ఉత్తర, తూర్పు ముఖాలపై ప్రసరింపచేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news