కరోనా వల్ల నిద్రలేమి ఇబ్బంది పెడుతుందా? ఐతే ఇది మీకోసమే..

-

కరోనా మహమ్మారి చేసిన నష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రపంచ ప్రజలందరినీ భయంలోకి నెట్టేసి కొన్ని రోజుల పాటు దానికి తాళం వేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది మనుషుల ప్రాణాలు బలి తీసుకున్న, ఇంకా తీసుకుంటున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అయితే కనిపెట్టేసాం. చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. కొందరు దానితో పోరాడలేక చేతులు వదిలేసారు. ఐతే పోరాడి గెలిచిన వారికి ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా నిద్రలేమి.

అవును, కరోనా వచ్చి పోయాక ఒక్కొక్కరినీ ఒక్కోలా ఈ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కరోనాసోమ్నియా. దీని నుండి బయటపడడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. దీనికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ఉద్యోగం కోల్పోవడం
ఆర్థిక పరమైన ఒత్తిడి
కరోనా భయం
పని- జీవితం బ్యాలన్స్ సరిగ్గా లేకపోవడం
రెగ్యులర్ గా రోగనిరోధక శక్తి గురించి బాధపడడం

నివారణ

రోజువారి దినచర్య సక్రమంగా ఉంచుకోవాలి. ఇంటి దగ్గర నుండి పనిచేస్తున్నప్పుడు కూడా ఆఫీసుకి వెళ్తున్నట్టుగా పనులు చేసుకోవాలి.

పొద్దున్నపూట మంచి సంగీతం వింటే అది మనసు మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

మొబైల్, ల్యాప్ టాప్ వంటి వాటిని పక్కన పెట్టాలి. వాటి నుండి వచ్చే నీలికాంతి కళ్ళని బాగా ప్రభావితం చేసి నిద్రని దూరం చేస్తుంది. పనివేళల్లో తప్ప ఎక్కువగా వాటికి దూరంగా ఉండాలి.

పడుకునే ముందు కాఫీ తాగవద్దు. అది మెదడు మీద ప్రభావం చూపి నరాల్ని ఉత్తేజ పరుస్తుంది. అందువల్ల నిద్ర దూరమవుతుంది.

రాత్రిపూట భోజనం చేసిన రెండు గంటల పాటు నిద్రపోకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news