ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా వేరియంట్స్ కి వ్యతిరేకంగా కొవ్యాక్సిన్, కోవిషీల్డ్..!

-

కరోనా మహమ్మారి కారణంగా మనం ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నాము. మరొక పక్క
వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ SARS-CoV-2 వేరియంట్ల ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టాకు వ్యతిరేకంగా పని చేస్తుండగా, డెల్టా ప్లస్ వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావ పరీక్షలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

ఇదిలా ఉంటే ఇందులో మొత్తం 4 రకాల వేరియంట్లు ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా. ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని విషయాలు చెప్పారు. వాటి కోసం చూస్తే..కోవాక్సిన్ ఆల్ఫా వేరియంట్‌తో ఏమాత్రం మారదు మరియు ఇది ప్రామాణిక జాతితో సమానంగా ఉంటుంది అని అన్నారు.

కోవిషీల్డ్ ఆల్ఫాతో 2.5 రెట్లు తగ్గిస్తుంది. డెల్టా వేరియంట్ కోసం కోవాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుంది. అయితే యాంటీబాడీ రెస్పాన్స్ మూడు రెట్లు తగ్గింపుకు కొద్దిగా తగ్గించబడుతుంది, మరియు కోవిషీల్డ్ కి అయితే ఇది రెండు రెట్లు తగ్గింపు చూపుతుంది. ఫైజర్ మరియు మోడెర్నాలో ఇది ఏడు రెట్లు తగ్గిస్తుంది అని ఆయన చెప్పారు.

కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ SARS-CoV-2- ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా వేరియంట్స్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి. డెల్టా ప్లస్ అయితే 12 దేశాలలో ఉంది. భారత దేశం లో అయితే 12 రాష్ట్రాల్లో 51 కేసులు ఉన్నాయని చెప్పడం జరిగింది.

డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించి ఐసిఎంఆర్ స్టడీ చేస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ పని చేస్తుందా అనే దానిపై పరిశోధన చేస్తున్నారు. ఏడు -10 రోజుల్లో ఈ ఫలితాలు తెలుస్తాయి అని ఆయన అన్నారు.

ఇది ఇలా ఉంటే .1.617 జాతిలో మూడు రకాలు ఉన్నాయి – B.1.617.1, B.1.617.2 మరియు B.1.617.3. డెల్టా వేరియంట్స్ ని 16 దేశాలలో ఉన్నట్టు గుర్తించారు. అవి ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఇండియా, ఇండోనేషియా, ఇజ్రాయెల్, జపాన్, కెన్యా, మయన్మార్, పెరూ, పోర్చుగల్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.

కరోనా ఇంకా తగ్గలేదని.. చాల చోట్ల వేరియంట్స్ ని చూస్తున్నామని భార్గవ అన్నారు. భారతదేశంలో కొన్ని కొన్ని జిల్లాలలో కొన్ని వేరియంట్స్ ని గమనిస్తున్నమని ఏది ఏమైనా సోషల్ డిస్టెన్స్ పాటించడం.. మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు.

ఇలా చేయడం వల్ల కరోనా వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా మంచిదని దీని వల్ల వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందదని అన్నారు కఠినమైన రెస్ట్రిక్షన్స్ పెట్టాలని దీంతో మహమ్మారిని అదుపు చేయవచ్చని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news