COVID vaccination: మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వాళ్లకు కరోనా వ్యాక్సినేషన్

-

కరోనా వ్యాక్సినేషన్ పై  కేంద్రం మరో ముందడుగు వేసింది. మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల లోపు వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోస్ ప్రారంభం కానుంది. దీంతో కరోనాపై పోరును మరింత వేగవంతం చేయనుంది భారత్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 179,91,57,486 వ్యాక్సిన్ డోసులను అర్హులైన వారికి అందించింది.

ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 2020 జనవరి 16న ప్రారంభించింది. జనవరి 16 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. 2020 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. 2020 ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2020 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. తాజాగా ఈనెల 16 నుంచి 12-14 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ కారణంగా దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నా… మరణాల సంఖ్య చాలా వరకు తగ్గింది. రానున్న రోజుల్లో దేశంలో కరోనా కేసులు మరింత తగ్గే అవకాశం ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news