కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ప్రత్యేక పింఛను!

సెకండ్‌ వేవ్‌ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా కుటుంబాలు వీధిన పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. చనిపోతున్న వారి సంఖ్యలు కూడా పెరగడంతో ఇంటి పెద్దను, తల్లిదండ్రులను కోల్పోతున్న చిన్నారులు హృదయ విధారకమైన సంఘటనలు కోకొల్లలు. అయితే, కరోనా బారిన పyì న కుటుంబాలకు ప్రభుత్వం శనివారం మే 29న ప్రత్యేక పెన్షన్‌ పథకాన్ని ప్రకటించింది.

ఈ పథకం కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు పోయిన బాధిత కుటుంబాలకు వర్తిస్తుందని తెలిపింది. ఆ కుటుంబాలకు ఇతర సంక్షేమ పథకాలను వర్తించేలా కృషి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పెన్షతోపాటు, జీవిత బీమా పథకాలను ఈడీఎల్‌ఐ (ఎంప్లాయీస్‌ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌) పథకం ద్వారా వర్తింపజేయనున్నారు. ఈ నూతన పథకాన్ని స్వయానా ప్రధాన మంత్రి నరేదంద్ర మోడీ ప్రకటించారు. దీంతో ఆ కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌ బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వారికి సహకారం అందిస్తుందని సంఘీభావం ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్వీటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ పెన్షన్‌ ద్వారా కొవిడ్‌ బాధిత కుటుంబాలకు డెయిలీ వేజ్‌లో దాదాపు 90 శాతానికి సమాన వేతనాన్ని అందించనున్నారు. ఈ పథకం 2020 మార్చి 24 నుంచి 2022 మార్చి వరకు వర్తింస్తుందని పీఎంఓ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా కొవిడ్‌ కారణంగా ఆర్థికంగా కుదేలైన కుటుంబాలనుద్దేశించి ఈ పథకాన్ని ప్రారంభించారు. బీమా కవరేజీని రూ.6 నుంచి 7 లక్షలకు పెంచారు. మినిమమ్‌ రూ.2.5 లక్షలుగా నిర్ధేశించింది. ఇది 2020 ఫిబ్రవరీ 15 నుంచి 3 ఏళ్లపాటు వర్తిస్తుంది. ఈ ఫథకానికి సంబంధించిన వివరాలను త్వరలో మినిస్ట్రీ ఆఫ్‌ లెబర్‌ ప్రకటించనుందని పీఎంఓ తెలిపారు.