కోవిడ్ పాజిటివ్ వచ్చి, హోమ్ ఐసోలేషన్ లో ఉంటే మీ డైట్ లో ఇవి తీసుకోండి…!

మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందా…? హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా…? మందులతో పాటుగా డైట్ మీద కూడా మీరు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మంచి డైట్ తీసుకుంటే రికవరీ ఫాస్ట్ గా అవ్వచ్చు. వైరస్ కారణంగా ఎక్కువగా నీరసం ఉంటుంది పైగా రుచి వాసన కూడా తెలియదు. కరోనా పాజిటివ్ వస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..

కరోనా వచ్చిన వాళ్ళు ఇంట్లో హోమై సొల్యూషన్ ఉన్నప్పుడు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. డైట్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండేటట్టు చూసుకోవాలి అలానే ప్రోటీన్ మరియు
అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి.

కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు చేపలు మరియు ఉడికించిన గుడ్లు కూడా తీసుకోవచ్చు. చికెన్ కూడా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. రెడ్ మీట్ ని అసలు తీసుకోవద్దు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. కనీసం పది గ్లాసుల నీళ్లు అయినా రోజు తాగాలి. దీనితో డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు.

అలాగే ఆహారం తీసుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి వాటితో వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కాబట్టి వీటిని ప్రిఫర్ చేయండి. మీల్స్ తీసుకునేటప్పుడు 6 నుంచి 8 సార్లు రోజు తినడం మంచిది. వాటిలో నెయ్యి లేదా బెల్లం ఎక్కువగా ఉండేటట్లు తీసుకోండి.

కూరలు ఎక్కువగా వేసి కిచిడీ లాంటివి కూడా తినొచ్చు. విటమిన్ సి కూడా అవసరం. బత్తాయిలు వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే విటమిన్ సి టాబ్లెట్ కూడా మీరు వాడొచ్చు. డ్రై ఫ్రూట్స్ తో చేసిన లడ్డూలను తీసుకోవచ్చు.

దీనిలో నెయ్యి కూడా వాడండి. ఇలా తయారుచేసిన లడ్డు ని రోజుకు ఒకటి లేదా రెండు తింటే జింక్, మాంగనీస్, మెగ్నీషియం వంటివి మీకు అందుతాయి. ఎప్పుడు మీరు ఇబ్బంది పడొద్దు అసలు భయపడొద్దు. హైజీన్ మెయింటెన్ చేసి ఆవిరి పట్టి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ని చేస్తూ ఈ విధంగా మెడికిషన్ తో పాటు డైట్ ను తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.