భారత్ లో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ప్రతి రోజూ ఎనభై వేలకి పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 95,735 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,172 మంది మరణించారు.
ఇక నిన్నటిదాకా నమొదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 44 లక్షలను దాటింది. మొత్తం కేసుల సంఖ్య 44,65,864గా ఉంది. ఇక ఈ కేసులలో 919018 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3471784 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో 75062 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక నిన్న ఒక్క రోజే 11, 29,756 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటిదాకా మొత్తం 5,29,34, 433 కరోనా పరీక్షలు చేసినట్టు అయింది.