వారి విష‌యంలో ఏపీ స‌ర్కారు క‌క్క‌లేక.. మింగ‌లేక‌.. తెగ బాధ‌..!

-

క‌రోనా పుణ్య‌మా అని ఏపీ ప్ర‌భుత్వం తీవ్ర‌మైన రాజ‌కీయ సుడిగుండంలో కూరుకుపోయింది. తాము తీసు కున్న క‌ట్ట‌డి చ‌ర్య‌ల కార‌ణంగానే ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం రేగ‌కుండా పోయింద‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించి, హ్యాపీ గా ఉంద‌ని చెప్పిన నాలుగు రోజుల‌కే కేసుల సంఖ్య మూడు అంకెల‌కు చేరువైంది. రాత్రికి రాత్రి పెరిగిన 43 కేసుల‌తో 87కు చేరింది. అయితే, ఈ సంఖ్య వ‌చ్చే రెండు రోజుల్లో రెండు వంద‌లు దాటొచ్చ‌ని వైద్య శాఖ వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. అయితే, ఇలా రాత్రికి రాత్రి కేసుల సంఖ్య పెరిగిపోవ‌డం వెనుక ఢిల్లీలో జ‌రిగి మ‌ర్క‌జ్ కార‌ణ‌మ‌ని ప్ర‌బుత్వం గుర్తించింది.

మ‌ర్క‌జ్ త‌బ్కిల్‌కు వెళ్లిన ఏపీకి చెందిన 800 మంది ముస్లింల కార‌ణంగానే ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ పెరిగిం దని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తాజాగా ఆరోపించారు. నిజానికి నిన్న‌టి వ‌ర‌కు కేవ‌లం 10 నుంచి 20 మ‌ధ్యే ఉన్న కేసుల పాజిటివ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. దీనికి ఢిల్లీ మ‌ర్క‌జ్ కార‌ణ‌మ‌ని మం త్రులు కూడాఅభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, ఈ విష‌యంలో ఎలా స్పందించాలి?  ఏ విధంగా మాట్లా డాలి? అనే విష‌యాల‌పై మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

నిజానికి ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాం తంలో జ‌రిగిన మ‌ర్క‌జ్ ఘ‌ట‌న‌పై ప‌త్రిక‌లు కూడా నిన్న‌టి వ‌ర‌కు సంయ‌మ‌నం పాటించాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. క‌రోనా వ్యాప్తికి మైనార్టీ వ‌ర్గం కార‌ణం కావ‌డ‌మే. వారిని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తే.. సు న్నిత‌మైన ఓటు బ్యాంకు క‌ద‌ల బారుతుంద‌నేది ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా ప‌రిణ‌మించింది. ఈ క్ర‌మం లోనే పైకి వారిని ఏమీ అన‌లేక‌.. అలాగ‌ని ఉండ‌లేక మ‌థ‌న ప‌డుతోంది. ఇక‌, ఇప్ప‌టికే క‌డ‌ప‌కు చెందిన ఓ మ‌త పెద్ద త‌మ మ‌త‌స్థుల‌ను ఉద్దేశించి ఓ నోట్ జారీ చేశారు. “ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షాలు కూడా మ‌న‌ల్నే టార్గెట్ చేస్తున్నాయి.

మ‌నం వీళ్ల‌కి అవ‌కాశం ఇవ్వొద్దు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారంతా వెళ్లి స్వ‌చ్ఛందంగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోండి“- అని పిలుపు నిచ్చారు. దీంతో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిణామాల విష‌యంలో ముస్లిం వ‌ర్గాన్ని టార్గెట్ చేయ‌డం ప్ర‌మాద‌మ‌ని గుర్తించిన వైసీపీ ప్ర‌భుత్వం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. మంత్రి బొత్స కూడా ఆచితూచి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news