ప్రపంచంలోని ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను మేం తయారు చేశామంటే.. మేం తయారు చేశామని.. ఆయా దేశాలు పోటీ పడుతున్నాయి. కరోనా వైరస్‌ను నియంత్రించే యాండీ బాడీలను మేం తయారు చేశామని ఇజ్రాయెల్ మొదట చెప్పింది. అయితే వెంటనే ఇటలీ రంగంలోకి దిగి ఏకంగా తాము వ్యాక్సిన్‌నే తయారు చేశామని చెబుతోంది. త్వరలోనే ప్రజలకు ఆ వ్యాక్సిన్‌ను అందిస్తామని కూడా ఇటలీ ప్రకటన చేయడం విశేషం.
ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న స్పాల్లాన్‌జని హాస్పిటల్‌లో కరోనా వైరస్ ఉన్న ఎలుకలపై సైంటిస్టులు తాజాగా ప్రయోగాలు చేశారు. దీంతో ఆ వైరస్‌ను నియంత్రించగలిగే యాంటీ బాడీలను తాము తయారు చేశామని, ఆ ప్రయోగాలు సక్సెస్ అయ్యాయని ఇటలీ రక్షణ శాఖ మంత్రి నఫ్తాలి బెన్నెట్ తెలిపారు. ఇక అక్కడి బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఐబీఆర్) కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో విజయవంతమైందని, అయితే ప్రస్తుతం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అది అప్రూవ్ కాగానే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ప్రొడక్షన్‌ను స్టార్ట్ చేస్తామని కూడా తెలిపారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు ఇటలీపై పడింది.
అయితే ఇటలీ చెబుతున్నట్లుగా కరోనా వ్యాక్సిన్ నిజంగా తయారైతే.. అది జనాలకు అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాగా కరోనా వైరస్ ధాటికి భారీగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ కూడా ఒకటి. అక్కడ 2.13 లక్షల మందికి కరోనా సోకగా, 29వేల మందికి పైగా చనిపోయారు.