భారత దేశంలో తయారుచేసిన నాజల్ వ్యాక్సిన్ గేమ్ చేంజర్ అవ్వచ్చు అని వెల్లడించిన WHO టాప్ సైంటిస్ట్..!

-

ఇండియాలో తయారు చేసిన నాజల్ వ్యాక్సిన్స్ గేమ్ చేంజర్ అవ్వొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఇది గేమ్ చేంజర్ లాగ మారొచ్చని ఆమె అంటున్నారు. ఎందుకు అంటే కరోనా మూడవ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తోందని వార్తలు మనం విన్నాం.

ఇండియాలో తయారు చేసిన కొన్ని నాజల్ వ్యాక్సిన్స్ నిజంగా పిల్లల్లో గేమ్ చేంజర్ అవుతాయని రెస్పిరేటరీ ట్రాక్ట్ కూడా సరిగ్గా ఉండొచ్చని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలని పాఠశాలలో పనిచేసే టీచర్లు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలి అని స్కూల్స్ తెరిచిన తర్వాత పిల్లలకి వాళ్ళ వల్ల ఎటువంటి రిస్క్ రాకుండా ఉండాలని అన్నారు.

అదే విధంగా మనం పిల్లల్లో కూడా వ్యాక్సిన్ అందిస్తామని.. కానీ ఈ సంవత్సరంలో అది అవ్వదని తప్పకుండా పాఠశాలలు తెరవాలని ఆమె అంటున్నారు. మిగిలిన దేశాలు కూడా అలానే చేశాయని మరి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని ఆమె అన్నారు.

ఒకవేళ కనుక పిల్లలు కరోనా బారిన పడితే ఎటువంటి లక్షణాలు ఉండవని లేదా కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉంటాయని.. ఆసుపత్రుల్లో సాధారణంగా వాళ్ళు చికిత్స తీసుకోక్కర్లేదు అని నీతి ఆయోగ్ మెంబెర్ వికె పాల్ అన్నారు. అయితే ఏది ఏమైనా పిల్లలు కరోనా బారిన పడకుండా చూసుకోవాలని చెప్పారు.

10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జరిగిన మీటింగ్ లో ఇన్ఫెక్షన్ పిల్లల పై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, యువత పై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే డేటాని కలెక్ట్ చేయమని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news