పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి. ఈ బ్యాంక్ ఎన్నో రకాల సేవలని ఇస్తోంది.
రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ కి రిలీఫ్ కలిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వీస్ చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా లో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక కొన్ని సర్వీసు చార్జీలు ఎలా పడుతున్నాయి అనేది కూడా చూద్దాం. పీఎన్‌బీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు తగ్గించడం తో కస్టమర్లు ఇకపై డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు తక్కువ చార్జీ చెల్లిస్తే సరి పోతుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందాలని భావిస్తే.. ముందుగానే రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. కనుక దీనిని గమనించండి.
1800-1037-188 లేదా 1800-1213-721 నెంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా మీరు ఈజీగా డీఎస్‌బీ మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోచ్చు. అదే విధంగా ఇంటి వద్దకే క్యాష్ పొందాలని భావిస్తే.. రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ముందు అయితే రూ.60 నుంచి రూ.100 వరకు ఉండేవి.