కరోనా కేసులు రోజు రోజుకీ భయంకరంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు నమోదు కావడం మొదలయిన కొత్తలో ఇండియా మొత్తం మీద నమోదయిన కేసులు ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. లాక్ డౌన్ లేకుండా సడలింపులు ఇవ్వడమే దానికి కారణమని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే రేపు ఉదయం 11 గంటలకు 10 రాష్ట్రాలలో కోవిడ్-19 పరిస్థితి మీద ప్రధాని మోడీ సమీక్ష జరపనున్నట్టు చెబుతున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమీక్షలో ప్రధానితో పాటు రక్షణ, ఆర్ధిక, ఆరోగ్యమంత్రులు అలానే హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు కూడా పాల్గొన నున్నారు. రేపు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర, బీహార్, గుజరాత్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో ఈ సమీక్ష జరగనున్నట్టు చెబుతున్నారు. మళ్ళీ లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు ఇక ఉండవని మోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చిన నేపధ్యంలో రేపటి సమీక్షలో ఏమి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.