ప్రభుత్వం పిల్లలకి కొత్త గైడ్లైన్స్… రెమిడీసీవర్ ఇవ్వొద్దు, ఆరు నిముషాలు వాక్ అవసరం..!

కరోనా వైరస్ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. కరోనా మూడవ వేవ్ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతోంది అన్న సంగతి మనకు తెలిసిందే. కరోనా వైరస్ పిల్లల్లో వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గైడ్ లైన్స్ ని విడుదల చేశారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పిల్లలకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ను జారీ చేశారు. వాటి కోసం చూస్తే… పిల్లల్లో రెమిడీసీవర్ ఇంజక్షన్స్ ఉపయోగించకూడదని చెప్పారు. అదే విధంగా కొద్దిపాటి లక్షణాలు లేనప్పటికీ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇబ్బందులు వస్తాయని దీని వల్ల తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

చాలా విపరీతంగా సమస్య ఉన్నప్పుడు మాత్రమే స్టెరాయిడ్స్ ఉపయోగించాలి అని అన్నారు. సరైన సమయానికి సరైన డోస్ మాత్రమే పిల్లలలో ఉపయోగించాలని అన్నారు. సొంతంగా స్టెరాయిడ్స్ ని ఉపయోగించకూడదు అని కూడా హెచ్చరించారు.

అదే విధంగా పిల్లలకి రెమిడీసీవర్ ఇంజక్షన్ ఇవ్వకూడదని అన్నారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో రెమిడీసీవర్ అసలు వాడొద్దని చెప్పారు. మంచి వైద్యులుని మాత్రమే సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అన్నారు.

మంచిగా జాగ్రత్తలు తీసుకోవడం, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం కూడా ఉండడం లాంటివి పాటించడం కూడా చాలా ముఖ్యమని అన్నారు. 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు ఆరు నిమిషాల పాటు వాకింగ్ చేయాలని. పిల్లలకి ఆక్సిమీటర్ పెట్టి పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళని ఆరు నిముషాలు నడిపించి చెక్ చేస్తే మంచిదన్నారు.

COVID-19 ఉన్న రోగులలో ఊపిరితిత్తుల ప్రమేయం యొక్క పరిధి మరియు స్వభావాన్ని చూడటానికి హై-రిజల్యూషన్ CT (HRCT) ను ఉపయోగించాలని మార్గదర్శకాలు సూచించాయి. అయినప్పటికీ ఛాతీ యొక్క HRCT స్కాన్ వలన వచ్చే సమాచారం తరచుగా చికిత్సా నిర్ణయాలపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.

ఇవి దాదాపు పూర్తిగా క్లినికల్ తీవ్రత మరియు శారీరక బలహీనతపై ఆధారపడి ఉంటాయి. కనుక అటువంటి సమయం లో ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేయడం మంచిదన్నారు.