కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొత్త లక్షణాలు…!

కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టిపీడిస్తోంది. నిజంగా రోజు రోజుకి కేసులు ఎక్కువైపోతున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది పేషెంట్స్ ఆక్సిజన్ బెడ్స్, ప్లాస్మా మరియు ఇతర మెడికల్ సదుపాయాల తో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఈ వైరస్ లక్షణాలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.

అయితే గతం లో జ్వరం, జలుబు, దగ్గు, రుచి లేకపోవడం, వాసన తెలియక పోవడం లాంటి లక్షణాలతోనే కరోనా వల్ల ఇబ్బంది పడే వారు. కానీ ఇప్పుడు కొత్త లక్షణాలు కూడా కరోనా కి దారి తీస్తున్నాయి. ఈ కొత్త లక్షణాలని మీరు నిర్లక్ష్యం చేయొద్దు.

కేవలం వైరస్ సీనియర్ సిటిజన్స్ ని, మధ్యవయస్కులుని మాత్రమే కాకుండా యువతని కూడా ఎఫెక్ట్ చేస్తోంది. అయితే తాజా నివేదికల ప్రకారం నీరసం, అలసట మరియు హఠాత్తుగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం కూడా కరోనా లక్షణాలు అని అంటున్నారు డాక్టర్లు. వైద్యుల దగ్గరికి చాలా మంది పేషెంట్లు వచ్చి ఈ చెప్పలేని అలసట తో బాధపడుతున్నారని చెప్తున్నారు.

కోవిడ్ 19 ఇతర లక్షణాలు ఏమిటి…?

జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాసన తెలియక పోవడం, రుచి తెలియకపోవడం, శ్వాస ఆడకపోవడం, కళ్లు ఎరుపెక్కడం, వినిపించకపోవడం. ఇలాంటి లక్షణాలు కనుక కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.