మొబైల్ స్క్రీన్స్ ని ఉపయోగించి.. కొత్త పద్దతితో కరోనా టెస్ట్..!

-

కరోనాని కనుగొనడానికి కొత్త పద్ధతిని రీసెర్చర్లు అభివృద్ధి చేయడం జరిగింది. మొబైల్ ఫోన్ స్క్రీన్స్ నుండి శ్వాబ్ ని ఉపయోగించి కరోనా వైరస్ ని చేయొచ్చు అని చెప్తున్నారు. మరి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

తక్కువ ఖర్చుతో కరోనా వైరస్ ని టెస్ట్ చేయడానికి నిపుణులు ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. మొబైల్ ఫోన్ స్క్రీన్స్ నుండి శాంపిల్ ని కలెక్ట్ చేయవచ్చని అంటున్నారు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ రీసెర్చర్లు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుండి శ్వాబ్ సహాయంతో డైరెక్ట్ గా ఎవరికైనా టెస్ట్ చేసుకోవచ్చని అన్నారు.

కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లలో దీనిని వాడి టెస్ట్ చేసే సరికి పాజిటివ్ వచ్చింది. ఫోన్ స్క్రీన్ టెస్టింగ్ అనేది ఒక కొత్త పద్ధతి. ఈ పద్ధతి ద్వారా 81 శాతం నుంచి నూరు శాతం వైరస్ ని కనుక్కోవచ్చు అని నిపుణులు అంటున్నారు.

పైగా ఇది చాలా సులభమైన పద్ధతి. క్లినికల్ టెస్ట్ కంటే కూడా ఇది చాలా మంచి పద్ధతి. పైగా ధర కూడా చాలా తక్కువ. ఎవరైనా సరే దీనిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు కరోనా టెస్ట్ చేయించుకోవడం కాస్త కష్టంగా ఉంటోంది.

కానీ దీని వల్ల ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ శాంపిల్ నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఇది కలెక్ట్ చేస్తుంది. తక్కువ ఆదాయం ఉండే దేశాలకి కూడా ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. అయితే నిపుణులు ఏం చేస్తున్నారంటే… కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి రెగ్యులర్ గా టెస్టులు తప్పకుండా చేయాలని అన్నారు.

అయితే చాలా ప్రదేశాలలో సరిగ్గా టెస్ట్ కూడా జరగడం లేదని ఇటువంటివి రావడం వల్ల రెగ్యులర్ గా టెస్ట్స్ జరుగుతాయని.. దీనితో కరోనని కనుక్కుని కట్టడి చేయొచ్చని అన్నారు. మామూలుగా టెస్ట్చే సుకోవడానికి కాస్త ధర ఎక్కువ మరియు కంఫర్ట్ గా ఉండదు. కానీ ఇది ఈజీ అని UCL Institute of Ophthalmology, Rodrigo Young అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news