వీటిని కనుక దృష్టి లో పెట్టుకుంటే కరోనా ఇన్ఫెక్షన్ వలన ఇబ్బందులు వుండవు. మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వేలల్లో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఇటువంటి సమయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిని కనుక మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు సమస్యలు రావు. ఈ విషయాలు చాలా ముఖ్యమని నిపుణులు చెప్పారు. జ్వరం మొదలైన లక్షణాలు మొదట కనపడతాయి. అయితే వెంటనే లక్షణాలు కనిపించవు అని ప్రతి ఒక్కరు గమనించాలి.
కరోనా వచ్చిన 2 నుండి 14 రోజుల కి లక్షణాలు కనపడడం మొదలుపెడతాయి. రెండు నుంచి మూడు రోజులు ఆ లక్షణాలు తగ్గవు. ముందు గొంతు నొప్పి, అలసట వంటివి వస్తాయి ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు, జ్వరం, కాళ్లు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇది నాలుగో రోజు కనపడతాయి. ఐదో రోజు వరకు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత దగ్గు, జలుబు, అలసట, తలనొప్పి ఉంటాయి.
కరోనా వచ్చిన ఐదు ఆరు రోజులు చాలా ముఖ్యం. జాగ్రత్తగా పేషంట్ ఉంటే ఇబ్బందులు రావు. అయితే ఐదవ రోజు ఇంప్రూవ్ అవుతారు. జ్వరం, గొంతు నొప్పి తగ్గుతూ ఉంటాయి ఈ సమయంలో రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యం. ఒకవేళ ఇంకా ఐదవ రోజు ఆరవ రోజు ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వకపోతే మరింత కష్టంగా ఉంటుంది.
ఆక్సిజన్ లెవెల్ చెక్:
ఐదవ రోజు ఆరవ రోజు రికవరీ అవ్వకపోతే ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. ఈ సమయంలో తల నొప్పి ఎక్కువగా ఉంటుంది. మానసికంగా కూడా ఇబ్బందులు వస్తాయి. ఈ సమస్యలను రావడానికి కారణం ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం. ఇటువంటి సమయం లో ఆక్సి మీటర్ ని ఉపయోగించి చెక్ చేస్తూ ఉండాలి.
ఆక్సిజన్ ఇంప్రూవ్ ఐతే 13 రోజులకి రికవరీ అయిపోవచ్చు. 13 రోజులు దాటితే ఇక డేంజర్ ఎందుకు అంటే… హృదయ సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మొదట లక్షణాలు రాగానే సీరియస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఊపిరితిత్తులుకి కూడా సమస్య వస్తుంది.