పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంచడానికి పెద్దలు చేయాల్సిన పనులు 

-

పిల్లల్లో చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. అది పెద్దల బాధ్యత కూడా. దానికోసం తల్లిదండ్రులు కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

బేరమాడటం

పిల్లలకి బేరమాడటం నేర్పాలి. అవును, కాదు అని చెప్పకుండా బేరమాడటం నేర్పితే అన్ని రకాలుగా ఆలోచించే నేర్పు వస్తుంది. ఒక విషయాన్ని అన్ని కోణాల్లో చూసే దృష్టి అలవడుతుంది.

టీం వర్క్

టీమ్ లీడ్ చేసే వాళ్లే నాయకులుగా ఎదుగుతారు. అందుకే మీ పిల్లలని సమూహలతో పనులు చేయించండి. దీనివల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలనే విషయం అర్థం అవుతుంది.

నమ్మకాన్ని ఇవ్వండి

ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నమ్మకాన్ని అందివ్వండి. నమ్మకంగా ఉండడం ఎలాగో నేర్పించండి. కాన్ఫిడెంట్ గా కనిపించిన వారు చెప్పిన మాటలనే ఎవరైనా వింటారని గుర్తుంచుకోండి. మధ్య మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళ మాటలని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అందుకే నమ్మకం పెంచండి.

మెంటార్ ని వెతకండి

మీ పిల్లలకి మీరే మెంటార్ గా ఉంటారన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ, వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నిపుణులను వెతికి పట్టుకుంటే మరింత బాగుంటుంది. అది వారిలో ప్రతిభకు మెరుగు పెట్టడానికి బాగా సహకరిస్తుంది.

వాయిదా వేయడంలో అపాయాన్ని వారు తెలుసుకునేలా చేయండి.

ఈ రోజు వద్దు రేపు చేద్దాం అనే మాటల వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుందనేది వారికి తెలియజెప్పాలి. వాయిదా వేయడం ఒక్కసారి అలవాటైతే అది చాలా సమయాన్ని ఖర్చు చేస్తుంది. పనులు ముందుకు సాగకుండా అడ్డుగా నిలబడుతుంది. ఈ విషయాన్ని వారు తెలుసుకునేలా అర్థమయ్యే పద్దతిలో చెబితే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news