దేశంలో 358కి చేరిన ఓమిక్రాన్ కేసులు… నిన్న ఒక్క రోజే 100కు పైగా కేసులు..

-

ేప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ గజగజలాడిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించింది. తాజాగా ఇండియాలో కూడా ఓమిక్రాన్ కలవరాన్ని కలిగిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రెండు మూడు రోజుల్లోకే కేసుల సంఖ్య డబుల్ అవుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 358 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే వందకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఓమిక్రాన్ బారి నుంచి 114 మంది కోలుకున్నారు.

దేశంలో ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ప్యూలు అమలు చేస్తున్నాయి.

దేశంలో కరోనా కేసులను పరిశీలిస్తే… మహారాష్ట్రలో 88, ఢిల్లీలో 67, తెలంగాణలో 38, తమిళనాడులో 34, కర్ణాటకలో 31, గుజరాత్ లో 30, కేరళలో 27, రాజస్థాన్ లో 22, హర్యానాలో 4, ఓడిశాలో 4, జమ్మూ కాశ్మీర్ లో 3, వెస్ట్ బెంగాల్ లో 3, ఏపీలో 2, ఉత్తర్ ప్రదేశ్ లో 2, చత్తీస్ గడ్ లో 1, లఢక్ లో 1, ఉత్తరా ఖండ్ లో 1 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news