కోవిడ్‌ 19 డ్రగ్‌ను తయారు చేసిన రష్యా.. భారత్‌కు గుడ్‌ న్యూస్‌..!

-

కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు శ్రమిస్తున్నాయి. అయితే ఈ విషయంలో రష్యా ముందడుగు వేసింది. ఆ దేశంలోని సైంటిస్టులు కరోనా డ్రగ్‌ను తయారు చేశారు. అందుకు గాను వారు ఇన్‌ఫ్లుయెంజా చికిత్సకు వాడే ఓ పాత ఔషధానికి మార్పులు చేసి.. కొత్తగా ఔషధాన్ని తయారు చేశారు. ఇక ఆ డ్రగ్‌ కరోనాను నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అక్కడి సైంటిస్టులు వెల్లడించారు.

russhain scientists developed covid 19 drug using influenza drug

Favipiravir అనబడే ఓ యాంటీ వైరల్‌ డ్రగ్‌ను 2014లో జపాన్‌లో అప్రూవ్‌ చేశారు. అప్పటి నుంచి ఆ మెడిసిన్‌ను ఇన్‌ఫ్లూయెంజా చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే డ్రగ్‌ను ఉపయోగించి రష్యా సైంటిస్టులు Avifavir అనబడే మరో డ్రగ్‌ను తయారు చేశారు. ఈ డ్రగ్‌ కరోనాను పూర్తిగా నిరోధిస్తుందని సైంటిస్టులు చేపట్టిన క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. దీంతో ఈ డ్రగ్‌ వాడకానికి అక్కడ తాత్కాలికంగా పర్మిషన్‌ లభించింది. దీన్ని తయారు చేసినవారు పేటెంట్‌ కూడా పొందారు. ఇక మెడిసిన్‌కు గాను ఇదే నెలలో అక్కడ 60వేల యూనిట్లు సిద్ధం చేసి కోవిడ్‌ 19 రోగులకు చికిత్స అందించేందుకు వాడనున్నారు.

అయితే Favipiravir డ్రగ్‌పై ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ కంపెనీ కూడా 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. జూలై లేదా ఆగస్టు వరకు ఆ ఫలితాలు వస్తాయి. అయితే రష్యాలో ఇప్పటికే ఆ డ్రగ్‌ సమర్థవంతంగా పనిచేసింది కనుక.. భారత్‌లోనూ అలాంటి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నారు. అదే జరిగితే.. ప్రపంచ దేశాలన్నింటిలోనూ రష్యా తరువాత కోవిడ్‌ 19 డ్రగ్‌ను తయారు చేసిన దేశంగా భారత్‌ నిలుస్తుంది. ఆ డ్రగ్‌ కొత్తదేమీ కాదు కనుక.. దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ఏర్పడే అవరోధాలు అన్నీ తొలగిపోయాయి. దీంతో ఒకేసారి ఫేజ్‌ 3 ట్రయల్స్‌కు వెళ్లారు. దానిని ఇప్పటికే పేషెంట్లకు ఇచ్చి పరీక్షిస్తున్నారు. ఇక ఫలితాలు వస్తే.. మన దేశంలోనూ కోవిడ్‌ 19 మెడిసిన్‌ను తయారు చేస్తారు. అన్నీ ఓకే అయితే.. ఆగస్టు వరకు భారత్‌లో కోవిడ్‌ 19కు మెడిసిన్‌ వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news