ప్రపంచాన్ని కరోనా చుట్టడం ఏంటో గానీ సెలబ్రేటీల నుండి సామాన్యుల వరకు వారి వారి స్దాయికి తగ్గట్టుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఇక సినీతారలు వారికి తోచినంతగా కరోనా బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు చెబుతున్నారు.. ఇకపోతే వెంకి.. అదేనండి విక్టరీ వెంకటేష్ సాధరణంగా ఎలాంటి విషయంలో కూడా జోక్యం చేసుకోరు.. తనపనేదో తాను చేసుకుంటూ ఉంటారు.. అలాంటిది కరోనా విషయంలో పెదవి విప్పి ప్రజలను హెచ్చరిస్తున్నారు..
ఆ విషయం ఏంటంటే.. దేశంలోని ప్రజలు లాక్‌డౌన్ ముగిసిందని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశం మొత్తం తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని, అసలు జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం ఇప్పుడే కాబట్టి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇకపోతే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి గత 70 రోజులుగా నిర్విరామంగా కృషి చేసాయని, వీరి కృషి వ్యర్ధం అవకుండా మనల్ని మనం ప్రస్తుత పరిస్దితుల్లో కాపాడుకోవాలని పేర్కొన్నారు.. కాగా లాక్‌డౌన్ విధించడం వల్ల వైరస్ పారిపోలేదు.. కావున లాక్‌డౌన్ కాలంలో ఎలాగైతే రూల్స్ పాటిస్తూ ఉన్నామో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలని తెలిపారు..
ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అనేది ప్రతి వారు తప్పని సరిగ్గా ఆచరించవలసిన నియమం.. అంతేకాదు ఆరోగ్య శాఖ జారిచేసిన పద్దతులను ఆచరిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోండి.. అనాలోచితంగా ఆలోచించి ప్రాణాల మీదికి తెచ్చుకుని మీ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టకండి అని వెంకి చెబుతున్నారు..