శానిటైజర్ కంటే సబ్బు సేఫ్…!

-

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో అందరూ కూడా ఇప్పుడు శానిటైజర్ ని వాడాలని చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనితో వాటికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఎక్కడిక్కడ కరోనా సోకకుండా వాటి తో శుభ్రం చేసుకుంటున్నారు ప్రజలు. అయితే అది అంత మంచిది కాదని దాని కంటే సబ్బు సేఫ్ అని అంటున్నారు. తక్కువ ఖర్చులో సబ్బు ది బెస్ట్ అంటున్నారు.

అయిదు వేల ఏళ్ళ నాటి నుంచి కూడా సబ్బు వాడకం అనేది ఉంది. సబ్బు తయారీలో చిన్న సూదుల్లాంటి అణువులను వాడతారు. దీనితో సబ్బు తన పని తీరుని బ్యాక్టీరియా నిర్మాణం నుంచి మొదలు పెట్టి పూర్తిగా నాశనం చేస్తుంది. వేల బ్యాక్టీరియాలను 99 శాతం సబ్బు నాశనం చేస్తుందని చేతులను చాలా సేపు ఫ్రెష్ గా ఉంచుతుంది అంటున్నారు వైద్యులు. తక్కువ ఖర్చులో సబ్బు చాలా ప్రయోజనాలు ఇస్తుంది అంటున్నారు.

నూనె కొవ్వు వంటి వాటిని సబ్బు సమర్ధవంతంగా శుభ్రం చేస్తుంది అంటున్నారు. పూర్తిగా వైరస్ చేతుల మీద గాని ఒంటి మీద గాని ఉండకూడదు అంటే సబ్బు మంచిది అంటున్నారు. ఏ బ్రాండ్ సబ్బు అయిన సరే ఉపయోగం ఉంటుందని అంటున్నారు. సబ్బులో ప్రత్యేక లక్షణాలు ఉండటం వలన ఇబ్బంది ఉండదు అంటున్నారు. కాబట్టి వేరే వాటిని నమ్ముకోకుండా సబ్బుని నమ్ముకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news