అసలే కరోనా… ఆపై చలికాలం… ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే!

-

కరోనా వల్ల ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఈ మహమ్మారి ధాటికి ప్రాణాలు పోతున్నాయి. ఈ సమయంలోనే చలికాలం కూడా వచ్చేసింది. ఇక ఏటా చలికాలంలో వచ్చే ఫ్లూ జ్వరాలు, జలుబులు కరోనా బలపడటానికి చాలా ఆస్కారం ఉందని ఇప్పటికే వైద్య నిపుణులు పేర్కొన్నారు. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ క్రింది విధంగా తెలుసుకుందాం..

corona
corona

రోజు శరీరానికి వ్యాయామం చేయటం వల్ల బరువు తగ్గడమే కాదు.. ఆరోగ్యాన్ని గాడిలో ఉంచుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రోజు తప్పకుండా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అరగంట ఆడుతాపాడుతా చేసినా చాలంట.

చలికాలంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వరకూ అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి. కుదిరితే కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉన్న బియ్యం, చపాతీ, కేక్‌, పాస్తా వంటి వాటిని తగ్గించి… వీటికి బదులుగా పండ్లు, ధాన్యాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవచ్చు. దంపుడు బియ్యం, ఓట్స్‌, బ్రౌన్‌ బ్రెడ్‌ వంటి వాటినీ తినొచ్చు. మనందరికే తెలిసిందే.. ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల వంటివి శీతాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచివి.

ఇంట్లో తయారు చేసిన కషాయాలు, హెర్బల్‌ టీలను తీసుకుంటే మరీ మంచిది. రోజూ 4, 5 తులసి ఆకులూ తినటం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు నుంచి రక్షణ కోసం అల్లం ఎక్కువగా వాడాలి.

ఉదయం సూర్యకిరణాలు శరీరంపై పడేలా చూసుకోండి. దీంతో శరీరానికి కావాల్సిన విటమిన్‌-డి అందుతుంది. డీ- హైడ్రేషన్ బారిన పడకుండా సరిపడా నీటిని తాగాలి. మనందరికీ బాగా ఇష్టమైంది.. నిద్ర.. కనీసం రోజుకు 8 గంటలైన పడుకోవాలి. దీంతో ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సబ్బుతో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి. మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు పాటించాలి. చలితీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వెచ్చదనాన్ని అందించే దుస్తువులు ధరించడం మంచింది. పడుకునే మందు కొందరికి కాళ్లు చల్లగా అవుతాయి. అలాంటప్పుడు సాక్సులు ధరించి రాత్రి పడుకుండే మీ కాళ్లు చల్లబడవు. ఈ జాగ్రత్తలు పాటించి కరోనాతోపాటు చలితో జాగ్రత్తగా ఉందాం..

Read more RELATED
Recommended to you

Latest news