భారత దేశంలో ఇప్పుడు అందరినీ కుదిపేస్తున్న ప్రధాన టాపిక్.. లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు? ఇంకా ఎ న్ని రోజులు ఇళ్లలోనే బందీలుగా ఉండాలి? మా సమస్యలు ఈ ప్రభుత్వాలకు పట్టవా? మన దగ్గర కరోనా పెద్దగా లేదుగా.. ఇంకా లాక్‌డౌన్ ఎందుకు? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున ఎగసి పడుతు న్నాయి. నిజమే.. ప్రజల ఆవేదన అర్ధం చేసుకోవాల్సిందే.. నని ప్రభుత్వాలు కూడా అంటున్నా యి. కానీ, గత నెల సహా ఈ నెల తొలి ఐదు రోజుల లెక్కల తీసుకుంటే.. కరోనా మునుపటికి ఇప్పటికి భార త్‌లోనూ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. మార్చి నెల ఆఖరు నాటికి అంటే.. అప్పటికే పది రోజులు లాక్ డౌన్ ముగిసినప్పటి పరిస్తితికి కరోనా పెద్దలేదు.
దీంతో ప్రజలు ఆ లెక్కలు చూపిస్తున్నారు. ఇక్కడ మనకు తక్కువగానే ఉంది కదా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా లేదు కాబట్టి ఇక్కడ లాక్‌డౌన్ ఎందుకనే వాదన కూడా వచ్చింది. కానీ, ఏప్రిల్ రెండో వారం నుంచి దేశంలో పరిస్థితి మరింతగా దిగజారింది. ఏప్రిల్ ఏడో తేదీ తర్వాత పరిస్థితిని గమనిస్తే.. కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా గత 24 గంటల్లో 40 మంది చనిపో యారు. ఒక్కరోజులోనే 1,035 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒకే రోజు ఇన్ని మరణాలు, కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,447 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రమే వెల్లడించింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 1,574 కరోనా కేసులు నమోదు కాగా.. 110 మంది చనిపోయారు. మరో 188 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 911 కరోనా పాజిటివ్ కేసులతో తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 903కు చేరింది. ఏపీలోనూ కరోనా మరణాలు రెండంకెల సంఖ్యకు ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 400 దిశగా పరుగు పెడుతోంది. మరి ఈ నిజాలు తెలుసుకున్నాక కూడా లాక్‌డౌన్ ఎత్తేయాలా? ఆలోచిస్తే.. వాస్తవం ఏంటో అర్ధమవుతుందని అంటున్నారు వైద్యులు.