పాఠశాలలు తెరుచుకుంటున్న వేళ యూనిసెఫ్ జాగ్రత్తలు తెలుసుకోండి..

-

పాఠశాలలు తెరుచుకోవచ్చని కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నేటి నుంచి పాఠశాలలు ఓపెన్ చేసుకోవచ్చని ఇది వరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిస్థితులకి అనుగుణంగా పాఠశాలలు ఓపెన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు ఈ రోజు నుండే తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూనిసెఫ్( యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్) కొన్నిజాగ్రత్తలని సూచించింది.

పిల్లలు పాఠశాలకి వచ్చిన దగ్గర్నుండి ఇంటికి వెళ్లే వరకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచించింది.

మొదటగా, సామాజిక దూరం.

విద్యార్థికి విద్యార్థికి మధ్య కనీసం ఒక మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి.
ఒక తరగతి వారిని మరో తరగతి వారితో కలపకూడదు.
బ్రేక్ టైమ్ పరిమితికి మించి ఉండకూడదు.
క్లాస్ రూంలోకి వెలుతురు వచ్చేటట్లుగా చూసుకోవాలి. పూర్తిగా మూసి ఉన్న తరగతి గదుల్లో క్లాసులు నిర్వహించరాదు.

మాస్క్..

మాస్కు ఎప్పుడు ధరించాలన్న విషయం ఉపాధ్యాయులు విద్యార్థులకి చెప్పాలి. అలాగే వాడేసిన మాస్కులని ఆటస్థలాల్లో పడవేయకుండా చూసుకోవాలి. విద్యార్థులకి వినికిడి సమస్యలు ఉన్నట్లయితే మాస్క్ పెట్టుకుని పాఠం చెబుతుంటే వారికి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు పారదర్శక మాస్కులు వాడాలి. దానివల్ల ఉపాధ్యాయులు ఏం మాట్లాడుతున్నారో పెదాల కదలిక ద్వారా విద్యార్థులు తెలుసుకుంటారు.

శుభ్రత..

పాఠశాల నుండి విద్యార్థులు వెళ్ళిపోగానే తరగతి గదులని శుభ్రపర్చాలి. ఉపరితలాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూనే బెటర్.

చేతులు కడుక్కోవడం..

విద్యార్థులు పాఠశాలల్లోకి ఎంట్రి అవుతున్నప్పుడు ఖచ్చితంగా టెంపరేచర్ చెక్ చేయాలి. ఉపాధ్యాయులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. తరచుగా చేతులు కడుక్కునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి.

అస్వస్థతకి గురైన విద్యార్థుల కోసం ప్రత్యేక గది ఏర్పాటు చేయాలి. ఆ గదిలోకి వెలుతురు ఎక్కువగా వచ్చేట్లు చూసుకోవాలి. ఆ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఫీవర్, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకి ఆరోగ్యం బాగు అయ్యేంత వరకి సెలవు ప్రకటించాలి. స్కూలు తెరుచుకున్నా కూడా ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలి.

పై జాగ్రత్తలన్నీ పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉంటామని యూనిసెఫ్ చెబుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news