వరంగల్‌ ప్రజలూ… జర భద్రం..!

-

తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత కరోనా విజృంభణ పాత వరంగల్‌ జిల్లాలోనే. తబ్లిగీ దెబ్బ వరంగల్‌కు గట్టిగానే తాకింది.

తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలు కరోనా గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. ఈ మహాప్రసాదం ఎవరు పంచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పది రోజుల కిందట ఒక్కటంటే ఒక్క కేసు లేని వరంగల్‌, నేడు దాదాపు 30కి పైగా పాజిటివ్‌ కేసులతో వణికిపోతోంది.

ఇక, వరంగల్‌ అర్జన్‌ జిల్లా పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. 25 కేసులు ఇక్కడే ఉండటం ప్రజలను బాగా కలవరపరుస్తోంది. తబ్లిగీ జమాత్‌కు హాజరైన స్థానికులు నగరం నలుమూలలా ఉండటంతో అటు మడికొండ నుంచి వరంగల్ స్టేషన్‌ దాకా, ఇటు మామునూరు నుండి అటు హసన్‌పర్తి దాకా మొత్తం నగరాన్ని కరోనా చుట్టేసినట్లయింది.

వరంగల్‌ నుండి తబ్లిగీ జమాత్‌కు హాజరైనవారు కూడా నగరంలోని ముస్లిం కాలనీలలో కొద్దోగొప్పో పేరున్నవారు. ఆ విధంగా అన్ని కాలనీల నుండి ఒక్కరో, ఇద్దరో ప్రముఖులను తరలించారు. వారు తిరిగొచ్చి, వారి కాలనీలలో మీటింగులు ఏర్పాటు చేసి. విశేషాలు వివరించారు. అంతే… వారి నుంచి బయల్దేరిన కరోనా, అంతా చుట్టేసింది. ప్రస్తుతం పరిస్థితికి అదే కారణం. ఇంకా కొంతమంది ఆచూకీ లేదు. మరికొందరు తిరగబడ్తున్నారు. దాంతో గత్యంతరం లేక ప్రభుత్వాధికారులు ఆయా ప్రాంతాలను గుర్తించి ‘హాట్‌స్పాట్‌’లుగా మార్కింగ్‌ చేసారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేసులు అధికారికంగా ఈ విధంగా ఉన్నాయి.

వరంగల్‌ అర్బన్‌ – 24, ములుగు-2, మహబూబాబాద్‌-1, భూపాలపల్లి-1, జనగాం-2. ఇంకా పరీక్షాఫలితాలు తేలాల్సినవి చాలా ఉన్నాయి. హాట్‌స్పాట్‌లుగా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలు ఇవే.

  1. జులైవాడ. 2.సుబేదారి. 3.ఈద్గా 4.కుమార్‌పల్లి 5.మండిబజార్‌ 6.పోచమ్మమైదాన్‌ 7.చార్‌బౌలి 8.కాశిబుగ్గ 9.గణేశ్‌ నగర్‌ 10.నిజాంపుర 11.లక్ష్మిపురం 12.రంగంపేట్‌ 13.శంభునిపేట 14.బాపూజీనగర్‌.

ఈ పై ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అత్యంత జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. ఈ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉన్నాయి. నిత్యావసరాలు, కూరగాయలు ఆయా ప్రాంతాలకే సరఫరా చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news