మాస్క్‌ వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్‌!

-

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు సైతం అతలాకుతలమవుతున్నాయి. అయితే ట్విట్టర్‌ వేదికగా వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ మాస్క్‌ల వాడకంపై గైడ్‌లైన్స్‌ని జారీ చేసింది. సెకండ్‌ వేవ్‌ ఉధృతి వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని గైడ్‌లైన్స్‌లను విడుదల చేసింది. ఇప్పటికే చాలా వేదికల ఆధారంగా, పోర్టల్ల ద్వారా మాస్కు లేనిదే బయటకు వెళ్లకూడదని, కరోనాని కట్టడి చేయడానికి నిబంధనలను ఆరోగ్య సంస్థ నిపుణులు ప్రజల్ని హెచ్చరిస్తున్నారు.

మెడికల్‌ లేదా ఫ్యాబ్రిక్‌ మాస్కులు ఎవరు ఏ మాస్కులను ధరించాలో ఆదేశాలను జారీ చేసింది. ఈ రెండు రకాల మాస్కుల్లో ఎవరు ఏ మాస్కులు వాడాలో సూచించింది డబ్ల్యూహెచ్‌ఓ.


మెడికల్‌ లేదా సర్జికల్‌ మాస్క్‌లు

ఏ రకమైన మాస్కులు ఎవరు వాడాలో వీడియోను విడుదల చేసింది. మెడికల్‌ మాస్కులను ముఖ్యంగా ఆరోగ్య సంబంధించిన వైద్య సిబ్బంది, కోవిడ్‌ పాజిటివ్‌ లక్షణాలు ఉన్నవారు, కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తులను కలిసినవారు సర్జికల్‌ మాస్కులను వాడాలని సూచించింది.
అదేవిధంగా వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో, మీటర్‌ సామాజిక దూరం కూడా పాటించని పరిస్థితి ఉన్నపుడు మెడికల్‌ మాస్కులను 60 సంవత్సరాలు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు వాడమని సూచించింది.

ఫ్యాబ్రిక్‌ మాస్కులు

మెడికల్‌ మాస్కుల కొరత ఏర్పడినపుడు ఫ్యాబ్రిక్‌ , కాటన్‌ క్లాత్‌ల ద్వారా మాస్కుల తయారీని ప్రారంభించాం. ఇంట్లోనే చాలా మంది తయారు చేసుకుంటున్నారు. ఈ మాస్కులు కొవిడ్‌ లక్షణాలు లేనివారు, సోషల్‌ వర్కర్స్, క్యాషియర్స్‌తో దగ్గర కాంటక్ట్‌ ఉన్నవారు కూడా వాడచ్చు.
ఈ కాటన్‌ క్లాత్‌ మాస్కులను పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రదేశాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గ్రోసారీ ఇతర జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కూడా వాడవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.
ఇటీవల రెండు మాస్కులను వాడటం కూడా కొన్ని దేశాలు తమ ప్రజల్ని సూచిస్తున్నాయి. దీని వల్ల కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఈ సూచనలు చేస్తున్నాయి. ఏది ఏమైనా మాస్కు లేనిదే బయటకు వెళ్లకుండా ఉండటం మొదట ఆచరించాల్సిన నిబంధన.

Read more RELATED
Recommended to you

Latest news