దొరికిన 34 మంది, జెఎన్‌యులో ఇరుక్కుపోయిన బిజెపి…!

-

గత ఆదివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటి లో జరిగిన దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ‘యునిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్’ అనే వాట్సాప్ గ్రూపులోని 60 మంది సభ్యులలో 37 మందిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు, గత వారం జెఎన్‌యు విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన దాడితో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు గుర్తించిన వారిలో 10 మంది బయటివారిగా గుర్తించారు.

వారు వర్సిటి విద్యార్ధులు కాదని అధికారులు భావిస్తున్నారు. 34 మంది దాడిలో పాల్గొన్న వారిగా గుర్తించారు. హింసాకాండకు వారు సంబంధం ఉన్న గ్రూపులు, వామపక్ష విద్యార్థి సంఘాలు మరియు బిజెపి-అనుసంధానమైన ఎబివిపి (అఖిల్ భారతీయ విద్యా పరిషత్) రెండూ బయటి వ్యక్తుల నుండి సహాయం తీసుకున్నాయని అధికారులు గుర్తించారు. వారు లోపలికి రావడానికి విద్యార్ధులు సహకరించారని పోలీసులు భావిస్తున్నారు.

గుర్తించిన 37 మంది వ్యక్తులలో ఒకరు ఎబివిపి జెఎన్‌యు యూనిట్ కార్యదర్శి మనీష్ జంగిద్, అయితే ఈ దాడికి తనకు సంబంధం లేదని అతను చెప్పాడు. “నా ఫోన్ పగిలింది. నేను బాగు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా ఆ గ్రూప్ లో చేర్చారని తెలిసిందని జాతీయ మీడియాకు తెలిపాడు. ఈ ఘటనలో వేళ్ళు అన్నీ ఆర్ఎస్ఎస్ అనుభంద సంస్థ ఏబీవీపీనే దోషిగా చూపించడంతో ఇప్పుడు బిజెపి నేతలు ఇబ్బంది పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news