కార్తీక మాసంలో ఈ తప్పులు చేస్తే.. శని మీ వెనుకే వుంటుందట..!

కార్తీక మాసంలో చాలామంది తప్పనిసరిగా కొన్ని నియమాలని పాటిస్తూ ఉంటారు ఉదయం లేచిన వెంటనే నదీ స్నానం చేయడం.. దీపారాధన చేయడం అలానే కార్తీకమాసం అంతటా కూడా శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం.. ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండడం.. బయట ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం.. ఇలా చాలామంది కార్తీకమాసంలో ఆచరిస్తూ ఉంటారు.

కార్తీకమాసం చాలా ముఖ్యమైన మాసం. కార్తీక మాసంలో చేసే దానధర్మాలు పూజలు మనకి ఎంతో మంచి చేస్తాయి. ఇంత పుణ్యాన్ని తెచ్చే మాసం కాబట్టి ప్రతిరోజు చాలామంది కార్తీకమాసం లో అన్ని రోజులు కూడా నియమం తప్పకుండా తప్పులు చేయకుండా మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటారు.

కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే హనుమంతుడికి కోపం వస్తుంది అలానే ఏడు జన్మల శని మిమ్మల్ని వెంటాడుతుందని పండితులు అంటున్నారు. మరి ఎటువంటి తప్పులు ని ఈ మాసంలో చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

కార్తీకమాసంలో ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే మంగళ దోష ప్రభావం తగ్గుతుంది. నల్లటి బట్టలు వేసుకోకూడదు.
కార్తీక మాసంలో సాత్వికంగా ఉండాలి కనుక అసలు మద్యాన్ని ముట్టుకోకుండా ఉండాలి.
కార్తీక మాసంలో చేపలు తింటే తిన్నవారి ఇంట ధనం నీరులా ప్రవహిస్తుందిట. అలానే మాంసాన్ని అసలు ముట్టుకోకూడదు.
మాంసాన్ని కార్తీక మాసంలో తింటే కుజుడు మీ ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడట.
అంతేకాకుండా కార్తీక మంగళవారం నాడు ఎవరికి అసలు డబ్బులు ఇవ్వకండి అలానే ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకండి. ఈ తప్పుల్ని కనుక చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.