స్త్రీ శక్తే నాకు సురక్షా కవచం: ప్రధాని నరేంద్ర మోాదీ

-

మహిళలే మా విజయ సారథులు.. నాకు స్త్రీ శక్తి అనే సురక్షా కవచం లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్త్రీలు ఎక్కువగా ఓటేసిన చోట బీజేపీ బంపర్ విక్టరీ సాధించిందని ఆయన అన్నారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని అన్నారు.  కులాల వారీగా కొన్ని పార్టీలు ఓట్లను ఆడిగాయని ప్రజలను అవమానించాయని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. అయినా యూపీ ప్రజలు డెవలప్మెంట్ కే పట్టం కట్టారని ఆయన అన్నారు. కులం, జాతి అనేది దేశ ప్రగతికి ఉపయోగపడాలి కానీ.. విచ్ఛిన్నానికి కాదని హితవు పలికారు. ఉత్తరాఖండ్ లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండో సారి అధికారంలోకి వచ్చామని ఆయన అన్నారు. పేదరికం తొలగించేందు బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని మోదీ అన్నారు. నిజాయితీతో పనిచేస్తే ఎంతటి పనిఅయినా సాధ్యం అవుతుందని అన్నారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయం అని మోదీ అన్నారు. గోవాలో అందరి అంచానాలను తలకిందులుగా చేస్తూ బీజేపీ గెలిచిందని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news