ద్రావిడ్ పుట్టిన రోజున బీసీసీఐ వీడియో చూసారా…?

-

టీం ఇండియా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అతని అభిమానులు, క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. 47 ఏళ్ళ ద్రావిడ్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించిన ఫోటోలను వీడియో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీం ఇండియా వాల్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు అభిమానులు.

ఇక ఇదిలా ఉంటే ద్రావిడ్ కి సంబంధించి ఒక వీడియో ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్ లో నవంబర్ 8 1999 లో ద్రావిడ్ న్యూజిలాండ్ జట్టుపై సాధించిన 153 పరుగులకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి రీ ట్వీట్ చేస్తూ పలువురు క్రికెట్ ప్రముఖులు ద్రావిడ్ కి శుభాకాంక్షలు చెప్తున్నారు.

వివిఎస్ లక్ష్మణ్, హర్భజన్ వంటి మాజీ సహచరులు ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే కూడా ద్రావిడ్ కి శుభాకాంక్షలు చెప్పారు. “రాహుల్ ద్రావిడ్ కు అత్యంత గుర్తుండిపోయే వన్డే నాక్‌ అంటూ బేసిసిఐ పోస్ట్ చేసింది. ఓపెనర్ గంగూలీ అవుట్ అయిన తర్వాత సౌరవ్ గంగూలీ తర్వాత వీరిద్దరూ రెండో వికెట్‌కు 331 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసారు. ఆ మ్యాచ్ లో సచిన్ 186 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news