Valentines Day 2023: ఈ ప్రదేశాల్లో రొమాంటిక్ డే ని మరింత ప్రేమగా జరుపుకుందామా..

-

ప్రేమ జంటలు ఎదురుచూస్తున్న రోజు రానే వస్తుంది..వాలెంటైన్స్ డే 2023 వచ్చేస్తోంది. ప్రేమ జంటలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే ప్రేమికుల రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వేడుకగా జరుపుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. తమ జీవిత భాగస్వామిని, తమ లవర్‌ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా అందమైన, ఆహ్లాదకరమైన చోటుకు తీసుకు వెళ్లి వారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఆశ ఎంతోమందికి ఉంటుంది. అయితే, రెగ్యులర్‌గా అందరికీ తెలిసిన ప్రదేశాలు కాకుండా కొత్తగా ఏదైనా టూరిస్ట్ స్పాట్ ఉందా.. అయితే ఇది మీ కోసమే చదవండి..

 

గోవా అంటే చాలా మంది ఫ్రెండ్స్ తో వెళ్లి పార్టీలు చేసుకోవడానికే సరైన చోటుగా భావిస్తుంటారు. కానీ మీ మనసుకు ఇష్టమైన లవ్లీ పార్టనర్ తోనూ ఆనందంగా, సరదాగా గడపడానికి గోవాలో అనేక ప్రదేశాలు ఉన్నాయి. బటర్ ఫ్లై బీచ్, సింక్వెరిం బీచ్, అగోండా బీచ్, బెనాలిం బీచ్ తో పాటు ఇంకెన్నో బీచ్ లు వాలెంటైన్స్ డే కోసం సిద్ధమవుతున్నాయి. ఇవేకాకుండా దూద్ సాగర్ లాంటి మనసు దోచుకునే ప్రదేశాలు చాలానే ఉన్నాయి..

చిరపుంజి నుంచి 85 కిమీ దూరంలో ఉన్న దావ్‌కి మాత్రం పర్యాటకులకు, ప్రేమ జంటలకు ఇంకా ప్రత్యేకం. ముఖ్యంగా ఇక్కడి సరస్సులో బోటింగ్ చేయడం అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే రొమాంటిక్ ఎక్స్‌పీరియెన్స్.. అలాగే పర్యాటకులను కట్టిపడేసే లగ్జరీ హోటల్స్.. వాతావరణానికి అనుగుణంగా తమ గుణం మార్చుకునే ఎడారులు.. ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉదయ్‌పూర్ వచ్చే ప్రేమపక్షులను ఆకట్టుకుంటున్నాయి.ఇక కేరళ గురించి చెప్పనక్కర్లేదు.. అలెప్పీలోని బ్యాక్ వాటర్ పై బోటు హౌజులో విహరించడం మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం అంటుంటారు అక్కడికి వెళ్లి వచ్చిన పర్యాటకులు.. ప్రేమికుల రోజుకు కొద్ది రోజులు మాత్రమే ఉంది.. ఇక కానివ్వండి మీ ప్రయాణం.. మరింత రొమాంటిక్ గా ఎంజాయ్ చెయ్యండి.. హ్యాపీ వాలంటైన్స్ డే..

Read more RELATED
Recommended to you

Latest news