మారుతున్న కాలంతో పాటు మనుషుల మనసులు మారుతున్నాయి. ఒకప్పుడు అబ్బాయికి పెండ్లి చేయాలంటే అమ్మాయికి వంటా వార్పూ వస్తే చాలు.. మంచి అమ్మాయిగా పరిగణిస్తారు. ఈ రోజుల్లో.. అమ్మాయి ఏం చదువుకుంది. ఉద్యోగం చేస్తుందా లేదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇలా చుదువుకున్న అమ్మాయిని, ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పెండ్లి చేసుకోవడం వల్ల కుటుంబం బాగుంటుందంట. ఇంకా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. అవేంటో తెలుసుకోండి.
మీ పనిని అర్థం చేసుకుంటారు..
ఉద్యోగం చేయని మహిళలకు ఉద్యోగం చేసే వారి గురించి సరైన అవగాహన ఉండదు. దీంతో ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికొస్తే అది తేలేదు ఇది తేలేదంటూ విసిగిస్తుంది. అదే ఉద్యోగం చేసే అమ్మాయి అయితే తను కూడా కష్టపడుతుంది. ఆఫీసులో ఎలాంటి ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకుంటుంది. భర్త ఇంటికి ఆలస్యంగా వచ్చినా ఇంట్లో పనులన్ని చక్కబెడుతుంది. భర్తపై ఆదారపడకుండా సమస్యలను ఎదర్కొంటుంది. ఇవి మాత్రమే కావు ఇంటికి సంబంధించిన బ్యాంక్ లోన్ కరెంట్ బిల్లు, పనులు కూడా చూసుకుంటూ భర్త శ్రమలో పాలు పంచుకుంటుంది.
బడ్జెట్ తగ్గట్టుగా..
గ్రామాల్లో నివసించే కుటుంబాలకు, పట్టణంలో నివసించే వారికి ఖర్చుల్లో తేడాలుంటాయి. గ్రామాల్లో అయితే ఇంటి అద్దె, కూరగాయల ఖర్చు, పిలల స్కూల్ తక్కువగా ఉంటుంది. పట్టణానికి వచ్చే సరికి కూరగాయలు కొనడానికి కూడా సంకోచిస్తుంటారు. కుటుంబంలో ఒకరు మాత్రమే ఉద్యోగం చేస్తూ మిగిలిన వారంతా ఖాళీగా ఉండడం వల్ల ఖర్చులు ఆకాశాన్నంటుతాయి. పెండ్లి చేసుకున్న అమ్మాయి కార్లో షికారు, మెట్రో ప్రయాణం చేయాలనుకుంటుంది. ఈ ఖర్చులన్నీ భరించాలంటే భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం చేయాలి. అప్పుడే పిల్లలను మంచి స్కూల్లో చేర్పించగలరు. సరైన తిండి పెట్టుగలరు.
సేవింగ్స్..
ప్రస్తుత కాలంలో సేవింగ్స్ లేకుంటే బతకడం కష్టం సుమా. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు. ప్రతి చిన్న విషయానికి అప్పు చేసుకుంటూ పోతే అప్పులు కోటలు దాటిపోతాయి. ఆలూమగలు కలిసి పని చేస్తుంటేనే తమ అవసరాలను తీర్చుకుంటారు. వారికి కావాల్సినవన్నీ అవలీలగా చేజిక్కించుకుంటారు. ఆ తర్వాత పిల్లల్ని కనడం, వారిని పెంచడంపైనా పొదుపు ప్రారంభిస్తారు. దీనికోసం పెండ్లి అయిన కొద్దిరోజులకే దీనికోసం మంచి ప్రణాళిక వేసుకుంటారు.
బయటి ప్రపంచంపై అవగాహన..
ఉద్యోగం చేసే అమ్మాయిలకు బయటి ప్రపంచంపై అవగాహన ఉంటుంది. వారిలో ఎక్కువమంది ఓపెన్ కలిగి ఉంటారు. వారు పని ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకుంటారు. వారికి పనిచేసే చోట ఒక వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వారికి తెలుసు.
ఇద్దరికీ చాలా మంచిది..
ఒక అమ్మాయి ఒక అబ్బాయి పనిచేసే వారే అయితే వారి వివాహ సంబంధానికి అది చాలా మంచిదని వారు భావిస్తారు. ఎందుకంటే చిన్న దానికీ, పెద్ద వాటికి సంబంధించిన ఖర్చులకు వారు భర్తపైనా, భార్యపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు. వారు తమ ఖర్చులకు సంబంధించి ఆందోళన కూడా చెందరు. ఆనందంగా జీవించేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది.