సోషల్ మీడియాలో తరచు మనకి చాలా ఫేక్ వార్తలు కనిపిస్తుంటాయి. వీలైనంత వరకు ఇలాంటి ఫేక్ వార్తలకి దూరంగా ఉండాలి. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. డబ్బులని కూడా కోల్పోతూ వుంటారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
ఫ్యాక్ట్ చెక్: కేంద్రం నుండి వారికి రూ. 6 వేలు..?
కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. ఈ స్కీమ్స్ వలన ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే కేంద్రం అందించే స్కీమ్స్ మీద నకిలీ వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక తాజాగా వచ్చిన వార్త కోసం చూస్తే.. కేంద్రం రూ. 6 వేల నిరుద్యోగ భృతి కింద ఇస్తున్నట్టు సోషల్ మీడియా లో ఒక వార్త తెగ షికార్లు కొడుతోంది.
एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है #PIBFactCheck
▶️यह मैसेज फर्जी है
▶️भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही
▶️कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें pic.twitter.com/eQVz5nYtLk
— PIB Fact Check (@PIBFactCheck) December 7, 2022
మరి ఇది నిజమేనా…? దీనిలో నిజం ఎంత అనేది చూస్తే.. కేంద్రం రూ. 6 వేల నిరుద్యోగ భృతి కింద ఇస్తోంది అని వస్తున్న వార్త కేవలం ఫేక్ వార్త మాత్రమే. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని చెప్పింది. రూ. 6 వేల నిరుద్యోగ భృతి కింద వస్తున్నది నకిలీ వార్త అని చెప్పేసింది. కనుక అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలకి దూరంగా వుండండి.