Fact Check: ఆల‌మ్ వాట‌ర్‌ను తాగితే కోవిడ్ త‌గ్గుతుందా ?

-

  • క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఫేక్ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఫ‌లానాది తీసుకుంటే కోవిడ్ వెంట‌నే త‌గ్గుతుంద‌ని ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవ‌న్నీ వ‌ట్టివేన‌ని తేల్చారు. ఇక ఇప్పుడు కూడా అలాంటి వార్త‌లు మ‌ళ్లీ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇంకో వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

fact check consuimg alum water cures covid 19 is it true

ఆల‌మ్‌.. దీన్నే ప‌టిక అంటారు. ఆల‌మ్ క‌లిపిన నీటిని తాగ‌డం వ‌ల్ల కోవిడ్ వెంట‌నే త‌గ్గుతుంద‌ని ఓ వార్త ప్ర‌చార‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్ అయింది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని వెల్ల‌డైంది. ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఆల‌మ్ క‌లిపిన నీటిని తాగడం వ‌ల్ల కోవిడ్ త‌గ్గుతుంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని, అలాంటి వార్త‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని హెచ్చ‌రించింది.

ఇక ఇటీవ‌లి కాలంలో ఈ త‌ర‌హా వార్తలు ఎక్కువ‌గా వైర‌ల్ అయ్యాయి. మిరియాల పొడి, తేనె, అల్లం ర‌సం క‌లిపి తీసుకుంటే కోవిడ్ త‌గ్గుతుంద‌ని, నిమ్మ‌ర‌సం చుక్క‌ల‌ను ముక్కులో వేసుకుంటే కోవిడ్ రాకుండా ఉంటుందని వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. కానీ అవేవీ నిజం కాద‌ని వెల్ల‌డైంది. క‌నుక సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మే ముందు ఒక‌టికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి. లేదంటే న‌ష్ట‌పోతారు.

Read more RELATED
Recommended to you

Latest news