ఫ్యాక్ట్ చెక్: లెన్స్ కవర్ చేసి కెమెరాతో ఫోటోలు ప్రధాని నరేంద్ర మోడీ తీసారా..?

-

తరచు మనకి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు కనబడుతుంటాయి. ఒక్కొక్క సారి ఏదైనా వార్త వస్తే ఇది నిజమా కాదా అని ఆలోచిస్తూ ఉంటాము. నకిలీ వార్తల్ని కూడా నమ్మి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైనా సరే ఫేక్ వార్తలకు దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా నష్ట పోవాల్సి వస్తుంది.

 

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. మరి ఇక దాని గురించి చూస్తే.. తాజాగా నమీబియా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు వచ్చాయి వీటిని కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంచారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా వీటిని తీసుకు రావడం జరిగింది. అయితే ప్రధాని  నరేంద్ర మోడీ వీటికి ఫోటోలు లెన్స్ ఓపెన్ చెయ్యకుండా తీస్తున్నట్లు ఒక వార్త వచ్చింది.

నిజంగా మోడీ ఫోటోలు లెన్స్ కవర్ ఓపెన్ చెయ్యకుండా తీసారా నిజమా కాదా అనేది చూస్తే.. ఇది ఫేక్ వార్త అని తెలుస్తోంది. వైరల్ ఇమేజ్ ని కేవలం ఎడిట్ చేశారని ఇది ఇది నిజమైన వార్త కాదని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ క్యాప్ ఓపెన్ చేయకుండ ఫోటోలు తీస్తున్నారన్నది నకిలీ వార్త. వైరల్ ఇమేజ్ ని కేవలం ఎడిట్ చేసారంతే.

Read more RELATED
Recommended to you

Exit mobile version