ఫ్యాక్ట్ చెక్: ఆవుపేడ తిన్న డాక్టర్ కి స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చిందా…? నిజమెంత..?

సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక నకిలీ వార్త వస్తూనే ఉంటుంది. అది వైరల్ గా మారింది. అయితే ఇక అసలు ఆ వార్తలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. హర్యానా కి సంబంధించిన ఒక డాక్టర్ ఆవుపేడను తీసుకున్నారు. ఆవు పేడను తీసుకోవడం వల్ల అతనికి స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. హాస్పిటల్ లో డాక్టర్ పడుకున్నట్లు ఫోటో కూడ వచ్చింది. అలానే మరొక ఫోటోలో డాక్టర్ ఆవు పేడ తింటున్నట్లు మనం చూడొచ్చు.

అయితే ఆవు పేడ తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని తప్పుడు ప్రచారం జరుగుతోంది. డాక్టర్ ఆవు పేడ తింటున్న వీడియో గతంలో నట్టింట తెగ వైరల్ అయ్యింది. అయితే ఆ డాక్టర్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది అంటూ పుకార్లు వస్తున్నాయి. లాజికల్ ఇండియా ప్రకారం చూసుకున్నట్లయితే డాక్టర్ కి ఎలాంటి సమస్య లేదని ఇది కేవలం నకిలీ వార్త అని తెలుస్తోంది.

Image

ఒక శవం ఫోటో పెట్టి అది డాక్టర్ ది అంటూ ప్రచారం చేస్తున్నారు. పైగా డెడ్ బాడీ నేపాల్ కి సంబంధించిన వ్యక్తిది అని గుర్తించారు అప్పటి ఫోటోలు తీసుకువెళ్లి ఇప్పుడు డాక్టర్ మనోజ్ మిట్టల్ అంటూ నకిలీ వార్తని పుట్టించారు. డాక్టర్ మనోజ్ హర్యానా ప్రాంతానికి చెందినవారు.

Image

సోషల్ మీడియాలో గతంలో ఆయన ఆవుపేడ తింటున్న ఫోటోలు, వీడియోలు కూడ వచ్చాయి. అలహాబాద్ మెడికల్ కాలేజ్ నుండి MBBS డిగ్రీని పొందారు. అయితే ఆవు పేడ తిన్న ఆ డాక్టర్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని వచ్చిన వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు.