ఫ్యాక్ట్ చెక్: కరోనా ఫండ్ కింద కేంద్రం రూ.5,000 ఇస్తోందా..? నిజం ఎంత..?

-

ఈ మధ్య కాలంలో నకిలీ వార్తలు బాగా ఎక్కువై పోతున్నాయి. ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మోస పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా ఫేక్ వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. స్కీముల మొదలు జాబ్స్ వరకు చాలా నకిలీ వార్తలు మనం ఈ రోజుల్లో వింటున్నాము.

అయితే తాజాగా మరో ఒక వార్త వచ్చింది. మరి అందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. యూనియన్ హెల్త్ మినిస్టరీ ఐదు వేల రూపాయలని కరోనా ఫండ్ రిలీఫ్ కింద ఇస్తోందని ఒక మెసేజ్ వచ్చింది.

నిజంగా యూనియన్ హెల్త్ మినిస్టరీ రూ. 5000 ఇస్తోందా లేదా అనేది చూస్తే… ఇది కేవలం ఫేక్ వార్త అని.. యూనియన్ మినిస్టరీ ఎటువంటి డబ్బులు కరోనా ఫండ్ రిలీఫ్ కింద ఇవ్వడం లేదని తెలుస్తోంది. కానీ చాలా మంది ఇది నిజం అనుకుని దీన్ని షేర్ చేస్తున్నారు.

ఇది ఫేక్ వార్త కాబట్టి ఎవరికి షేర్ చేయొద్దు. వాళ్ళని మీరు కూడా అనవసరంగా నమ్మి మోసపోవద్దు. ఇటువంటి ఫేక్ వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మోసపోతారు. కనుక నకిలీ వార్తలు కి దూరంగా ఉండండి అనవసరంగా నమ్మి చిక్కుల్లో పడకండి.

Read more RELATED
Recommended to you

Latest news