స్కీముల మీద వచ్చే స్కేములు గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. పదే పదే స్కీముల కి సంబంధించి ఫేక్ వార్తలు వస్తూ ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ప్రధాన మంత్రి జ్ఞాన వీర యోజన కింద యువతకి నెలకి రూ. 3,400 ఇస్తున్నారు అని ఒక వార్త వచ్చింది.
అయితే నిజంగా యువతకి రూ. 3,400 ని ప్రధాన మంత్రి జ్ఞాన్ వీర్ యోజన కింద యువత పొందొచ్చా..? ప్రభుత్వం జ్ఞాన వీర యోజన కింద యువతకి ఈ డబ్బులు ఇస్తున్నారా..? ఇందులో నిజమెంత అనేది చూద్దాం… తరచూ ఏదో ఒక నకిలీ వార్తని మనం చూస్తూ ఉంటాం. నిజానికి నకిలీ వార్తల పై దృష్టి పెట్టకపోతే మోసపోతూనే ఉంటాం.
दावा: प्रधानमंत्री ज्ञानवीर योजना के तहत पंजीकरण करने पर सभी युवाओं को प्रति माह ₹3,400 दिए जाएंगे। #PIBFactCheck
▶️यह दावा फ़र्ज़ी है।
▶️इस तरह की किसी वेबसाइट/लिंक पर अपनी निजी जानकारी साझा न करें।
▶️ऐसे संदेशों को फॉरवर्ड करने से पहले #FactCheck जरूर कर लें। pic.twitter.com/KVMzxMJnNW
— PIB Fact Check (@PIBFactCheck) September 6, 2022
మోసగాళ్ళు సోషల్ మీడియానే మంచి దారిగా భావించి నకిలీ వార్తలను స్ప్రెడ్ చేస్తూ.. మోసం చేస్తున్నారు. చాలా మంది డబ్బుల్ని కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ప్రధానమంత్రి జ్ఞాన వీర్ యోజన కింద నెలకి యువతకి రూ. 3,400 ని ఇస్తున్నారు అనేది నిజం కాదు. ఇది ఒక ఫేక్ మాత్రమే. అటువంటి నకిలీ వార్తలు కి దూరంగా ఉంటే మంచిది లేదంటే అనవసరంగా మోసగాళ్లు చేతుల్లో చిక్కుకుంటారు. అయితే ఇటువంటి వాటిని నమ్మదు. ఇతరులకు షేర్ చేయొద్దు.